ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాలు ఆచరించదగినవి. ఆయన బోధించిన ఎన్నో విషయాలు జీవితానికి ఉపయోగపడేలా ఉంటాయి. ఇప్పటికీ వాటిని చాలామంది ఫాలో అవుతుంటారు. చాణక్యుడి నీతి సూత్రాలు ఫాలో అయినవారు ఎప్పుడూ ఓడిపోరని నమ్ముతారు. చాణక్య నీతి ప్రకారం కొన్ని లక్షణాలున్న ఆడవాళ్లకు దూరంగా ఉండాలి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు అంటేనే నీతిశాస్త్రం, తెలివితేటలు గుర్తుకువస్తాయి. ఏళ్లు గడిచినా ఆయన మాటలు, నీతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. చాణక్యుడు తన నీతిసూత్రాల్లో ఆడవాళ్ల గురించి చాలా విషయాలు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం కొన్ని లక్షణాలున్న ఆడవాళ్లకు దూరంగా ఉండటం మంచిదట. వారు కుటుంబానికి, సమాజానికి హానికరంగా ఉంటారట. వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలట. ఇంతకీ ఎలాంటి వారికి దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
చిన్న మెడ
- కొంతమంది ఆడవాళ్లకు చిన్న మెడ ఉంటుంది. చిన్న మెడ ఉన్న ఆడవాళ్లు ఇతరులపై ఆధారపడతారు. బాగా పొడవాటి మెడ ఉన్న ఆడవాళ్లు దురదృష్టాన్ని తీసుకువస్తారు. చదునుగా ఉండే మెడ ఉన్న ఆడవాళ్లు కోపానికి గురవుతారని చాణక్యుడు తన నీతి బోధనల్లో చెప్పాడు. ఇలాంటి వారికి దూరంగా ఉండటం మంచిదని నీతి సూత్రాల్లో వివరించాడు.
పసుపు రంగు కళ్లు
- పసుపు రంగు కళ్లున్న ఆడవాళ్లు భయానికి, కోపానికి లోనయ్యే అవకాశం ఉందట. బూడిద రంగు కళ్లున్న ఆడవాళ్లు మంచి స్వభావం కలవారని చాణక్యుడు పేర్కొన్నాడు.
చేతులపై టాటూలు
- చాణక్య నీతి ప్రకారం నవ్వేటప్పుడు బుగ్గలు ఉబ్బే ఆడవాళ్లు మంచివారు కాదట. ఉబ్బిన రక్తనాళాలు, అసమాన ఆకారంలో చేతులు ఉన్న ఆడవాళ్లు జీవితంలో సంతోషానికి, సంపదకు దూరంగా ఉంటారట. చేతులపై కాకులు, గుడ్లగూబలు, పాములు, తోడేళ్ల టాటూలు వేయించుకున్న ఆడవాళ్లు ఇతరులకు హాని చేసే అవకాశం ఉందట.
చెవిలో వెంట్రుకలు
- చెవిలో వెంట్రుకలు ఉండే ఆడవాళ్లు, చెవులు సరైన ఆకారంలో లేని ఆడవాళ్లు ఇంట్లో గొడవలకు కారణం అవుతారని చాణక్యుడు తన బోధనల్లో వివరించాడు. పొడవైన లేదా ముందుకు చొచ్చుకు వచ్చిన పళ్లు ఉన్న ఆడవాళ్లు జీవితంలో ఎప్పుడూ బాధలు ఎదుర్కొంటారని చాణక్యుడు తన నీతిలో చెప్పాడు.
గమనిక
చాణక్యుడు చెప్పిన ఈ లక్షణాలను ఇప్పటి కాలానికి అన్వయించడం, అన్వయించకపోవడం వ్యక్తుల ఇష్టాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. అవి ఆ కాలంలోని సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్నాయి.