Chia Seeds: చియా సీడ్స్ ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. కానీ వాటిని ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమనే విషయం మీకు తెలుసా? అవును.. చియా సీడ్స్ ని సరైన పద్ధతిలో, సరైన మోతాదులో తీసుకోకపోతే సమస్యలు వస్తాయట. మరి ఎంత మోతాదులో, ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని సరైన మోతాదులో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చియా గింజల్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఇంకా ఎన్నో పోషకాలు ఉంటాయి. చిన్నగా ఉండే ఈ గింజలు మనకు చాలా పోషకాలు అందిస్తాయి. ఏదైనా సరే సరైన పద్ధతిలో, మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువగా తింటే సమస్యలు తప్పవు. చియా సీడ్స్ ఎలా తీసుకోవాలి? ఎక్కువ తింటే ఏం అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
చియా గింజలను ఎప్పుడూ పచ్చిగా తినకూడదు. పచ్చి చియా గింజల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలా తింటే అజీర్తి చేస్తుంది. పచ్చి చియా గింజలు శరీరంలోని నీటిని పీల్చుకుంటాయి. దీనివల్ల డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పచ్చి చియా గింజలు ఎక్కువగా తింటే, వెంటనే నీళ్లు ఎక్కువగా తాగండి. పచ్చి చియా సీడ్స్ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి.
చియా గింజలను నీళ్లలో నానబెట్టి తినాలి. రాత్రి నీళ్లలో వేసి ఉదయం తినొచ్చు. లేదా అరగంట ముందు నానబెట్టి తినాలి. వాటిని జావలో లేదా ఇతర ఆహార పదార్థాల్లో కలిపి కూడా తినవచ్చు.
చియా గింజలు తినే మోతాదు వయసు, ఆరోగ్య పరిస్థితి, ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పెద్దవాళ్లు రోజుకు ఒకటి లేదా రెండు చెంచాల చియా గింజలు (15 నుంచి 30 గ్రాములు) తినవచ్చు.
అలెర్జీ:
చియా గింజలు ఎక్కువగా తింటే కొందరికి అలెర్జీ వస్తుంది. దీనివల్ల వాంతులు, విరేచనాలు, పెదవులు, నాలుక దురద, చర్మంపై దద్దుర్లు, కళ్లలో నీళ్లు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు వస్తాయి.
అజీర్తి:
ఒకేసారి ఎక్కువ చియా గింజలు తింటే అజీర్తి చేస్తుంది. చియా గింజలు శరీరంలోని నీటిని పీల్చుకుంటాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వస్తాయి.
ఉక్కిరిబిక్కిరి:
ఎక్కువ చియా గింజలు తింటే ఒక్కోసారి ఊపిరాడనట్లు అవుతుంది. ఆహారం మింగేటప్పుడు ఇబ్బంది పడేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి.
క్యాన్సర్ ప్రమాదం:
కొన్ని అధ్యయనాల ప్రకారం చియా గింజల్లో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ALA) అనే ఒమేగా-3 కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.