
ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు కళ్ళ కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ డార్క్ సర్కిల్స్ వల్ల అలసిపోయినట్టుగా, వృద్ధాప్యం లేదా అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా కనిపిస్తారు. డార్క్ సర్కిల్స్ ను తగ్గించడానికి వివిధ కాస్మెటిక్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఏదేమైనా ఏదైనా చికిత్సను ఎంచుకునే ముందు వాటి వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడం చాలా అవసరం.
డార్క్ సర్కిల్స్ జన్యుపరంగా, జీవనశైలి, అనారోగ్య సమస్యలు వంటి కారణాల వల్ల కూడా అవుతాయి. ఈ నల్లటి వలయాలు సాధారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్య కానప్పటికీ.. ఇవి మిమ్మల్ని అందవిహీనంగా కనిపించేలా చేస్తాయి. ఏదో జబ్బున్న వారిలా కనిపించేలా చేస్తాయి. అయితే డార్క్ సర్కిల్స్ ఎందుకు అయ్యాయో సరైన కారణం తెలుసుకుంటే వీటిని పూర్తిగా వదిలించుకోవచ్చంటున్నారు నిపుణులు. దీంతో మీ అందం పెరుగుతుంది. మీకు మీపై మరింత ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
మన వయసు పెరుగుతున్న కొద్దీ మన కళ్ళ కింది చర్మం సన్నగా మారుతుంది. అలాగే ఇది సిరలు మరింత బయటకు కనిపించేలా చేస్తుంది. ఇది నల్లటి వలయాలకు దారితీస్తుంది. కొల్లాజెన్ తగ్గడం వల్ల కూడా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఎక్కువవుతాయి. అయితే కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మసాజ్ చేయడం చేసినా, ప్రతి రాత్రి ఆర్గాన్ నూనెను కళ్ల చుట్టూ రాయడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. అయితే మీ కళ్ళ క్రింద వారానికి ఒకటి లేదా రెండుసార్లు ప్రకాశవంతమైన మాస్క్ ఉపయోగించడం ద్వారా కూడా కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలు తగ్గిపోతాయి. డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన నిద్ర చాలా ముఖ్యం. ఆలస్యంగా నిద్రపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం, కళ్ళను రుద్దడం, సరైన కంటి పరిశుభ్రత లేకపోవడం వంటి కారణాలు కూడా నల్లటి వలయాలకు దారితీస్తాయి.
నల్లటి వలయాలను వదిలించుకోవడానికి కేవలం కళ్లపై కాదు మొత్తం ముఖం, మెడపై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ముఖంలోని కండరాలన్నీ అనుసంధానించబడి ఉంటాయి. కాబట్టి ఒక ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. మొత్తం ఆరోగ్యం మెరుగుపడటానికి, అందంగా కనిపించడానికి సమతుల్య , పోషకమైన ఆహారం తినడం చాలా ముఖ్యం.
మచ్చలేని చర్మాన్ని పొందడానికి, నల్లటి వలయాలను నివారించడానికి ఇలా చేయండి..
అంజీర్, అలోవెరా ప్యాక్ లను ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత పదిహేను నిమిషాల పాటు కళ్ల కింద, పైన అప్లై చేయండి. సీరం స్ప్రే చేసి మంచి నాణ్యత గల మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఈ నియమాలను పాటిస్తే ఇప్పటికే ఉన్న డార్క్ సర్కిల్స్ ను తగ్గిపోవడం ప్రారంభమవుతాయి. భవిష్యత్తులో అవి పూర్తిగా కనిపించకుండా ఉంటాయి.