ఎసిడిటీ ఉన్నవారు టీ, కాఫీలను తాగొద్దా?

By Mahesh RajamoniFirst Published Mar 24, 2023, 7:15 AM IST
Highlights

టీ, కాఫీలను తాగకుండా ఉండని వారు చాలా మందే ఉన్నారు. వీటిని తాగడం వల్ల శరీరం ఎనర్జిటిక్ గా మారుతుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. కానీ దీన్ని ఎసిడిటీ ఉన్నవారు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

మన దైనందిన జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటాం. వీటిలో జీర్ణ సంబంధ సమస్యలే ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ట్రిక్, మలబద్ధకం, గుండెల్లో మంట వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. నిజానికి మనం తినే ఫుడ్స్ వల్లే జీర్ణ సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలను కలిగించే ఆహారాలకు దూరంగా ఉంటే జీర్ణ సమస్యలకు చాలా వరకు దూరంగా ఉండొచ్చు. అయితే ఎసిడిటీ సమస్య వచ్చే వారు  కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలను తినాలి. అవేంటేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మజ్జిగ

మజ్జిగ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో మజ్జిగను తాగితే  శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నిమజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఎసిడిటీని తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే మజ్జిగను తాగేటప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడిని కలిపి తాగండి. 

కొబ్బరి నీరు

కొబ్బరి నీరు ఎండాకాలంలో  కొబ్బరి నీరు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.  కొబ్బరి నీటిని తాగితే కూడా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.  కొబ్బరి నీళ్లలో పొటాషియంతో  పాటుగా ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి. 

అల్లం

అల్లం నిమ్మరసం కలిపి తాగడం వల్ల కూడా ఎసిడిటీ తొలగిపోతుంది. ఈ రసంలో కొద్దిగా తేనె కలుపుకుని తీసుకుంటే కూడా మంచిదే. కడుపు చికాకులు, జీర్ణ సమస్యలను నివారించే సామర్థ్యం అల్లంలో ఉంటుంది. అందుకే ఎసిడిటీ సమస్య ఉన్నవారు అల్లాన్ని తీసుకోవాలి. 

కాకరకాయ జ్యూస్

కాకరకాయ జ్యూస్ లేదా కాకరకాయ వాటర్ తో కూడా ఎసిడిటీ తగ్గిపోతుంది. ఈ జ్యూస్ కు  రెండు మూడు పుదీనా ఆకులు, కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే ఎసిడిటీ తగ్గడంతో పాటుగా ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. 

జీలకర్ర నీరు

జీలకర్ర నీటిని తాగడం వల్ల కూడా ఎసిడిటీని నయమవుతుంది. జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల జీర్ణ సమస్యలను కొంతవరకు నియంత్రణలో ఉంటాయి.

తినకూడని ఆహారాలు, పానీయాలు

ఎసిడిటీ ఉన్నవారు కొన్ని ఆహారాలు, పానీయాలను తీసుకోవడం మానేయాలి. లేదా బాగా తగ్గించాలి. ముఖ్యంగా టీ, కాఫీ వంటి పానీయాలను తాగకూడదు. ఎందుకంటే టీ, కాఫీల్లో 'కెఫిన్' కంటెంట్ ఉంటుంది. ఇది అసిడిటీని పెంచుతుంది. అలాగే కార్బోనేటేడ్ పానీయాలు కూడా ఎసిడిటీని పెంచుతాయి. అందుకే వీటికి దూరంగా ఉండండి. కార్బోనేటేడ్ పానీయాలు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి.

చాక్లెట్, మిరపకాయలు, వెల్లుల్లి వంటి ఆహారాలు కూడా ఎసిడిటీని పెంచుతాయి. వీటిని ఎక్కువగా తినకండి. అసిడిటీ ఉన్నవారు వీలైనంత వరకు తక్కువ మసాలా ఫుడ్ ను తినడం అలవాటు చేసుకోవాలి.  

click me!