కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి..

Published : Mar 24, 2023, 10:15 AM IST
కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి..

సారాంశం

కొత్తిమీర తొందరగా వాడిపోతుంది. ఒకరోజు దాటిందంటే పూర్తిగా పాడవుతుంది. అయితే సరైన చిట్కాలతో కొత్తిమీరను ఎక్కువ రోజులు నిల్వ చేయొచ్చు. అదెలాగంటే..  

కొత్తిమీరను చైనీస్ పార్స్ లీ అని కూడా అంటారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు. కొత్తిమీర లేని కూరలు చాలా మటుకు ఉండవు. చాలా వంటకాల్లో దీన్ని గార్నిష్ చేయడానికి ఉపయోగిస్తారు. నిజానికి కొత్తమీర జస్ట్ రుచికే కాదు.. ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ ఇది చాలా తక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఉదయం తెచ్చిన కొత్తిమీర సాయంత్రానికల్లా పూర్తిగా వాడిపోతుంది. వాటి రుచి కూడా పూర్తిగా పోతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో కొత్తిమీరను ఎక్కువ రోజులు నిల్వ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

వాటర్ జార్ 

కొత్తిమీరను ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఇదీ ఒకటి. అందును నీటి జాడీలో  కొత్తమీరను నిల్వ చేస్తే ఇది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇందుకోసం కొత్తిమీర కాండాలను కట్ చేసి తాజా పువ్వుల మాదిరిగానే వాటిని నీటి జాడీలో ఉంచండి. జార్ ను ప్లాస్టిక్ బ్యాగ్ లేదా తడి గుడ్డతో పూర్తిగా కప్పి రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయండి. ఇలా చేస్తే కొత్తిమీర రెండు వారాల వరకు తాజాగా, హైడ్రేట్ గా ఉంటుంది. 

పేపర్ టవల్ 

కొత్తిమీరను తాజాగా ఉంచడానికి మరొక ఉత్తమ మార్గం తడి కాగితపు టవల్ తో చుట్టడం. ఇందుకోసం ఒక కాగితపు టవల్ ను నీటిలో ముంచి కొత్తిమీర చుట్టూ చుట్టండి. తర్వాత దీనిని ప్లాస్టిక్ బ్యాగ్ లేదా కంటైనర్ లో పెట్టండి. ఇది కొత్తిమీర తేమను నిలుపుకోవటానికి, ఎండిపోకుండా ఉంచడానికి సహాయపడుతుంది. ఆ బ్యాగ్ లేదా కంటైనర్ ను రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయండి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర ఒక వారం వరకు తాజాగా ఉంటుంది.

ఫ్రీజ్ చేయండి

కొత్తిమీర ఎక్కువగా ఉన్నా.. దానిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకున్నా ఫ్రీజ్ చేయడం మంచిది. ఇందుకోసం కొత్తిమీరను కడిగి ఆరబెట్టండి. ఆ తర్వాత వాటిని సన్నగా తరిగి ఐస్ క్యూబ్ ట్రేలో పెట్టండి. ప్రతి క్యూబ్ ను నీటితో నింపండి. అలాగే వాటిని గడ్డకట్టనివ్వండి. స్తంభింపచేసిన తర్వాత కొత్తిమీర ముక్కలను ట్రే నుంచి బయటకు తీసి వాటిని ఫ్రీజర్ బ్యాగ్ లో నిల్వ చేయండి. మీకు తాజా కొత్తిమీర అవసరమైనప్పుడు ఒక క్యూబ్ తీసి మీ వంటకు ఉపయోగించండి. 

హెర్బ్ కీపర్ 

హెర్బ్ కీపర్ అనేది మూలికలను ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి రూపొందించిన ఒక ప్రత్యేక కంటైనర్. ఈ కంటైనర్ అడుగుభాగాన వాటర్ ఉంటుంది. ఇది మూలికలను హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే పైన గాలి ప్రసరణను అనువుగా ఉంటుంది. కొత్తిమీరను హెర్బ్ కీపర్ లో ఉంచి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు వాడిపోకుండా ఉంటుంది.


 

PREV
click me!

Recommended Stories

Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు