తమలపాకులో యాంటీ డయాబెటిక్ కార్డియోవాస్కులర్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ అల్సర్, యాంటీ ఇన్ ఫెక్టివ్ ప్రాపర్టీలు ఉంటాయి.
హిందూ సంప్రదాయంలో తమలపాకుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి పూజలోనూ ఈ ఆకులను వాడుతూ ఉంటారు. అయితే.. కేవలం పూజలకు మాత్రమే కాదు... వైద్యపరంగానూ దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకులో యాంటీ డయాబెటిక్ కార్డియోవాస్కులర్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ అల్సర్, యాంటీ ఇన్ ఫెక్టివ్ ప్రాపర్టీలు ఉంటాయి.
ఇవి మాత్రమే కాదు.. ఈ ఆకుల్లో విటమిన్ సి, తయామైన్, నియాసిన్, రైబోఫ్లేవిన్ కూడా ఉంటాయి. ఈ ఆకులను పరగడుపున తినడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి అని నమ్ముతారు. మరి, ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
undefined
తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కి పవర్ హౌస్ గా చెబుతారు. అందుకే.. వీటిని తినడం వల్ల .... మలబద్దకం సమస్య తగ్గుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు.. రోజుకి ఒక్క ఆకు పరగడుపున తిన్నా.. ఉపశమనం లభిస్తుంది.
తమలపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి.. మన నోటి నుంచి వచ్చే దుర్వాసనను తరిమికొడుతుంది. అంతేకాదు.. పసుపు రంగులో మారిన దంతాలు కూడా తెల్లగా మారతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
ఒత్తిడిని తగ్గించడంలోనూ తమలపాకులు సమర్థవంతంగా పని చేస్తాయి. దీనిలో ఉండే ఫినాలిక్ కాంపౌండ్స్.. మెదడుకు రిలాక్సేషన్ అందిస్తాయి. అంతేకాదు.. ఎవరైతే డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారో.. వారికి కూడా ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ తమలపాకుల్ల యాంటీ హైపర్ గ్లైసెమిక్ ప్రాపర్టీలు.. షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతాయి. మన శరీరంలోని గ్లోకోజ్ లెవల్స్ పెరకుండా కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ పరగడుపున ఒక్క తమలపాకు నమిలినా.. షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
తమలపాకు పరగడుపున తినడం వల్ల... జీర్ణ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణ సమస్యలు ఏవి ఉన్నా.. అవి తగ్గిపోవడానికి తమలపాకు సమర్థవంతంగా పని చేస్తుంది. ఇవి మాత్రమే కాదు.. జాయింట్ పెయిన్స్ కూడా ఈజీగా తగ్గిపోతాయి.
సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. దగ్గు అయితే.. చాలా తొందరగా తగ్గుతుంది.