ఈ నీళ్లను ఉదయాన్నే తాగితే ఎంతటి పొట్టైనా ఇట్టే కరుగుతుంది

By Shivaleela Rajamoni  |  First Published Aug 23, 2024, 1:46 PM IST

ప్రస్తుత కాలంలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. పొట్ట పెరిగితే మనకు లేనిపోని వ్యాధులు వస్తాయి. అయితే మీరు ఉదయం లేచిన వెంటనే కొన్ని రకాల నీళ్లను తాగితే పొట్ట ఇట్టే కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 



తప్పుడు ఆహారాల వల్ల చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే చాలా మంది బరువు తగ్గేందుకు వ్యాయామం, డైటింగ్ ను చేస్తుంటారు. అయినా బరువు మాత్రం తగ్గరు. మీకు కూడా ఇలాగే అయితే ఉదయాన్నే కొన్ని రకాల నీళ్లను తాగండి. అవును కొన్ని రకాల నీళ్లు మీ పొట్టను కరిగించడానికి, వెయిట్ లాస్ అయ్యేందుకు సహాయపడతాయి. అవేంటంటే? 

లవంగం నీరు: లవంగాలు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. వీటిలో ఆకలిని తగ్గించి, జీవక్రియను పెంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి.  ఈ నీళ్లను తయారుచేయడానికి 1 గ్లాసు నీటిలో 3-4 లవంగాలను వేసి రాత్రంతా నానబెట్టండి. ఈ వాటర్ ను మార్నింగ్ రెండు నిమిషాల పాటు మరిగించి తాగండి. 

Latest Videos

undefined

అల్లం నీరు: అల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వాటర్ మీరు బరువు తగ్గడానికి, మలబద్దకం, ఉబ్బరం సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.  దీన్ని తయారుచేయడానికి కొంచెం అల్లాన్ని ఒక గ్లాస్ నీళ్లలో రాత్రంతా నానబెట్టండి.దీన్ని ఉదయాన్నే తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు మరిగించి తాగండి. 

మెంతివాటర్: మెంతుల్లో మంచి మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది. ఈ వాటర్ ను తయారుచేయడానికి ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ మెంతులను వేసి రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే 5 నిమిషాల పాటు మరిగించి వేడివేడిగా తాగండి.

చియా సీడ్స్ వాటర్ : చియా విత్తనాలలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్స్ నీటిని గ్రహిస్తాయి. ఈ వాటర్ ను తాగితే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అలాగే మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

click me!