స్మోకింగ్ చేస్తే జుట్టు రాలిపోతుంది జాగ్రత్త..

By Mahesh RajamoniFirst Published Jul 1, 2022, 5:44 PM IST
Highlights

స్మోకింగ్ చేస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోస వ్యాధులు వస్తాయన్న సంగతి దాదాపుగా అందరికీ తెలుసు కానీ.. జుట్టు రాలిపోతుందన్న సంగతే ఎవరికీ తెలిసి ఉండదు. 

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి అందరికీ తెలుసు. అయినా దీన్ని తాగేవారు చాలా మందే ఉన్నారు. అందులోనూ మన దేశంలో సిగరెట్లు తాగే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. స్మోకింగ్ చేస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ఎన్నో ప్రమాదరకమైన రోగాలు వస్తాయి. 2018 లో చేసిన ఒక పరిశోధన ప్రకారం.. పొగాకు పొగలో 7,000 కంటే ఎక్కువ రసాయనాలు ఉన్నాయని తేలింది.  ఈ రసాయనాలు 69 రకాల క్యాన్సర్లకు దారితీస్తాయని  అధ్యయనాలు తేల్చి చెప్పేశాయి. పొగాకు నుంచి విడుదలయ్యే రసాయనాలను పీల్చితే.. అవి మీ ఊపిరితిత్తుల నుంచి మీ రక్తప్రవాహానికి అటునుంచి ఇతర శరీర భాగాలకు చేరుతుంది. దీంతో మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 

సిగరెట్ తాగితే జుట్టు రాలిపోతుందా? సిగరేట్ తాగడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య బారిన పడతారని ఓ పరిశోధనలో తేలింది.

ధూమపానం జుట్టు రాలడానికి ఎలా దారితీస్తుంది?

జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది:  పొగాను వాడటం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతినడంతో పాటుగా విపరీతంగా జుట్టు విపరీతంగా రాలుతుంది. 2020 అధ్యయనం ప్రకారం.. స్మోకింగ్ చేయని వారితో పోల్చితే స్మోకింగ్ చేసే మహిళలు, పురుషుల్లోనే జుట్టు రాలడం, బట్టతల వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. ధూమపానం చేసే ప్రతి 500 మందిలో 425 మందికి జుట్టు రాలే సమస్య ఉందని పరిశోధకులు తేల్చారు. 

సిగరెట్లలోని నికోటిన్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి కాస్త జుట్టు రాలడానికి దారితీస్తాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. స్మోకింగ్ ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుంది. అలాగే కుదుళ్లకు రక్త ప్రవాహాన్ని తగ్గించేస్తుంది. దీంతో జుట్టు రాలిపోతుంది. అయితే దీనికి మరింత పరిశోధన అవసరమని నిపుణులు చెబుతున్నారు.

స్మోకింగ్ చేయడం వల్ల మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరంలో డిఎన్ ఎకు నష్టం కలుగుతుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో ఫ్రీ రాడికల్ పెరిగితే ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. సిగరెట్ తాగితే శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇదే బట్టతలకు దారితీస్తుందని ఓ పరిశోధన వెల్లడించింది. 

స్మోకింగ్ చేయడం వల్ల నెత్తిపై రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. అంతేకాదు ఇది రక్తహీనతకు కూడా దారితీస్తుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో జుట్టు విపరీతంగా రాలుతుంది. స్మోకింగ్ వ్యసనాన్ని మానడానికి లవంగం నూనె బాగా సహాయపడుతుంది. 

click me!