ఇండియాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎంతుందో తెలుసా.. అన్ని భాషల్లో తెలుగు భాష స్థానం ఎంతంటే..!

By Mahesh RajamoniFirst Published Jun 27, 2022, 9:42 AM IST
Highlights

Telugu language: ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల్లో మనుషులే గొప్పవారంటారు. ఎందుకో తెలుసా..? మన కంటూ భాష ఉంది కాబట్టి. భాషే సంబంధాలను ఏర్పరుస్తుంది. భాషే చరిత్ర పూర్వపరాలను మనకు తెలియజేస్తుంది. అందులో మాతృభాష గొప్పతనం మాటల్లో చెప్పలేనిది. మరి మన దేశంలో మన మాతృభాష తెలుగు ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..?
 
 

Telugu language: భాషంటూ లేకుంటే మనుషులకు, మూగజీవాలకు తేడా అంటూ ఏదీ ఉండదేమో.. భాష ఉంది కాబట్టే మనిషి ఉన్నత స్థానంలో ఉన్నాడు. అందులోనూ మన మాతృభాషకున్న ప్రధాన్యత పరాయి భాషలకు లేదనే చెప్పాలి. పై చదువుల కోసం, ఇతర దేశాలను వెళ్లడం కోసం, జాబ్స్ చేయడానికి పరాయి భాషలు అవసరమైతున్నప్పటికీ.. అమ్మ భాషను ఏవీ అధిగ మించలేవు. మనం నేర్చిన ప్రతి పలుకూ మాతృభాషలోనిది. అదే సమాజంలో మనకంటూ ఒక గుర్తింపునిస్తుంది. 

అమ్మ మనకు నేర్పిన ప్రతి పలుకులు కూడా మాతృభాషలోనే. ఏ హావ భావాన్నైనా ఇతర భాషలకంటే మాతృభాషలోనే ఎక్కువగా పలికించగలం. భావాలను చెప్పగలం. అందుకే మాతృభాషకు మించిన మరో భాష గొప్పదేం కాదంటారు. ఇది ప్రతి భాషకు వర్తిస్తుంది. భారతదేశంలో 10,000 లేదా అంతకంటే ఎక్కువ మంది మాట్లాడే భాషలు 121 ఉన్నాయి.  

జనాభా లెక్కల విశ్లేషణ ప్రకారం.. భారతదేశంలో 19,500కు పైగా భాషలు లేదా మాండలికాలు మాతృభాషగా ఉన్నాయి.  2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలు, మాట్లాడే వారి సంఖ్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. భారత దేశంలో టాప్ 10 లో ఉన్న భాషల లీస్ట్ ఇదే..

ఇండియాలో అత్యధికులు మాట్లాడే భాషగా హిందీ గుర్తించబడింది. దేశవ్యాప్తంగా 52. 83 కోట్ల మంది హిందీని మాట్లాడుతున్నారు. దేశంలో హిందీ భాషే మొదటి స్థానంలో ఉంది.

ఇక రెండో స్థానంలో బెంగాలీ భాష కొనసాగుతోంది. ఈ భాషను 9.72 కోట్ల మంది మాట్లాడేవారున్నారు. 

ఇక మూడో స్థానంలో మరాఠీ నిలిచింది. దీనిని మాట్లాడే వారు 8.30 కోట్ల మంది ఉన్నారు. 

ఇక మన దేశంలో తెలుగు భాష నాలుగో స్థానంలో నిలించిది. దేశవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారి సంఖ్య 8.11 మంది ఉన్నారు. 

తమిళం ఐదో స్థానంలో ఉంది. 6.90 కోట్ల మంది ఈ భాషను మాట్లాడుతున్నారు. 

గుజరాతీ ఆరో స్థానంలో నిలించిది. దీనిని 5.54 కోట్ల మంది మాట్లాడేవారున్నారు. 

ఉర్దూ ఏడో స్థానంలో ఉంది.. దీనిని దేశ వ్యాప్తంగా మాట్లాడే వారు 5.07 కోట్ల మంది మాట్లాడేవారున్నారు. 

కన్నడ ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీనిని దేశం మొత్తం మీద 4.37 కోట్ల మంది మాట్లాడుతున్నారు. 

ఒడియా 9వ స్థానంలో ఉంది. దీనిని దేశ వ్యాప్తంగా 3.75 కోట్ల మంది మాట్లాడుతున్నారు. 

భారతదేశంలో టాప్ 10 భాషల్లో మలయాళం భాష 10 వ స్థానంలో నిలిచింది. ఈ భాషను దేశ వ్యాప్తంగా 3.48 కోట్ల మంది మాట్లాడేవారున్నారు. 

click me!