పండంటి కాపురానికి.. 5 సూత్రాలు

By ramya NFirst Published Feb 28, 2019, 4:51 PM IST
Highlights

ఏ బంధంలోనైనా ఇద్దరు వ్యక్తులు విడిపోతే.. ఆ ప్రభావం ఆ ఇద్దరి మీద మాత్రమే ఉంటుంది. అదే భార్యభర్తలు విడిపోతే.. ఆ ఎఫెక్ట్.. మొత్తం కుటుంబం మీదే పడుతుంది.

ఏ బంధంలోనైనా ఇద్దరు వ్యక్తులు విడిపోతే.. ఆ ప్రభావం ఆ ఇద్దరి మీద మాత్రమే ఉంటుంది. అదే భార్యభర్తలు విడిపోతే.. ఆ ఎఫెక్ట్.. మొత్తం కుటుంబం మీదే పడుతుంది. అందుకే.. భార్యభర్తల బంధం చాలా దృడంగా ఉండాలంటారు పెద్దలు. ఈ బంధం అందంగా ఉండాలంటే.. ఒకరిని మరొకరు అర్థం చేసుకోవాలి. పరస్పరం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. అంతేనా.. ఇంకా చాలా ఉన్నాయి. ఈ కింది చిట్కాలు ఫాలో అయితే.. మీ బంధం కొన్ని కాలాల పాటు దృఢంగా ఉంటుంది. 

భార్యాభర్తలన్నాక తగువులు, చిన్నపాటి గొడవలు సాధారణం. అంత మాత్రాన మీ భాగస్వామి గురించి మీ తోబుట్టువులు, బంధువుల దగ్గరగా తక్కువ చేసి    మాట్లాడొద్దు. తనతో మీకేదైనా సమస్య ఉంటే నేరుగా మాట్లాడాలి. పరిష్కరించుకునేలా చూసుకోవాలి. 
‌‌
చిన్నదైనా, పెద్దదైనా విజయం చాలా గొప్పది. కాబట్టి తన విజయాలను మీరు సంతోషంగా వేడుక చేసుకోండి. తన ఆనందాలను పంచుకోవడం వల్ల మీ బంధం దృఢమవుతుంది. దీని ద్వారా మీరు తనని ఎంతగా ప్రేమిస్తున్నారో, గౌరవిస్తున్నారో తెలుసుకుని మరింత ప్రేమిస్తారు. 

 ఆఫీసు, ఇతర సమస్యల వల్ల తనకు తీరిక లేకుండా ఉన్నప్పుడు, అలాగే పని ఒత్తిడికి గురైనప్పుడు మీరే తనకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అలాంటి సమయంలోనే ‘నేనున్నానంటూ’ భరోసా ఇస్తే తన నిస్తేజం దూరంగా పారిపోతుంది. 

మీ ప్రేమను చేతల్లో వ్యక్తం చేయండి. తన చేతులను ప్రేమగా మీ చేతుల్లోకి తీసుకోవడం,  ఆప్యాయంగా హత్తుకోవడం, చిరు చుంబనాలు... ఇవన్నీ మీ బంధాన్నీ మరింత బలపరుస్తాయి. 

‌‌ ఇతరులతో మీ భాగస్వామిని పోల్చొద్దు. దానివల్ల మీరు తనతో సంతోషంగా ఉండటం లేదని పొరపాటు పడే అవకాశం ఉంది. అందులో నుంచే తనకు మీరు గౌరవం ఇవ్వట్లేదనే ఫీలింగ్ మొదలయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ఏదైనా అనుకుంటనే నేరుగా చెప్పేయాలి. గొనగడం లాంటివి విసుగు తెప్పిస్తాయి. ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు.. మీ బంధం మరింత అందంగా కొనసాగుతుంది. 

click me!