మురిపించి.. మైమరిపించేవారిపైనే మగువల మోజు

Published : Feb 22, 2019, 04:11 PM IST
మురిపించి.. మైమరిపించేవారిపైనే మగువల మోజు

సారాంశం

శృంగారం శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. దానిని హాయిగా ఆస్వాదించాలి తప్ప.. హడావిడిగా పనికానించేశాం అనుకోకూడదంటున్నారు నిపుణులు. 

శృంగారం శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. దానిని హాయిగా ఆస్వాదించాలి తప్ప.. హడావిడిగా పనికానించేశాం అనుకోకూడదంటున్నారు నిపుణులు. మగువలను మురిపించి మైమరిపించి.. శృంగారం వైపు తీసుకువెళ్లడంలో మాత్రమే వేగం చూపించాలట. ఆ తర్వాత పనిని ఎంత స్లోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేసేవారిని స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారని వారు చెబుతున్నారు.

ఈ విషయంపై కొందరు నిపుణులు చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. శృంగారం విషయంలో వేగం అస్సలు పనికిరాదు అనేది నిపుణుల వాదన. పురుషులు దూకుడుగా ఉండటాన్ని స్త్రీలు ఎక్కువగా ఎంజాయ్ చేయలేరట. నెమ్మదిగా.. ఫ్లోర్ ప్లేతో మొదలుపెడితేనే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారని వారు చెబుతున్నారు.

అప్పుడప్పుడు భార్య, భర్తలు సెక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండాలట. అలా మనసు విప్పి మాట్లాడుకుంటేనే ఎవరు ఎలా ఇష్టపడుతున్నారనే విషయంపై స్పష్టత వస్తుందంటున్నారు. అంతేకాదు.. ఎప్పుడూ పురుషులే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని స్త్రీలు అనుకోకూడదట. అప్పుడప్పుడు స్త్రీలు కూడా చొరవతీసుకుంటే.. పురుషులు ఆనందంగా ఫీలౌతారని వారు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Marriage: పెళ్లి చేసుకుంటే ఆదాయం పెరుగుతుందా.? ఇదెక్క‌డి లాజిక్ అనుకుంటున్నారా
Double Dating: వేగంగా పెరుగుతోన్న డబుల్ డేటింగ్ కల్చర్.. అసలేంటీ కొత్త ట్రెండ్.?