తనని కాదని.. వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్న గర్ల్ ఫ్రెండ్ పై ప్రియుడు పెళ్లి మండపంలోనే పగ తీర్చుకున్నాడు.
తనని కాదని.. వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్న గర్ల్ ఫ్రెండ్ పై ప్రియుడు పెళ్లి మండపంలోనే పగ తీర్చుకున్నాడు. ప్రియుడు ఇచ్చిన షాక్ కి ఆ యువతికి దిమ్మతిరిగిపోయింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... అంకిత్ అనే యువకుడు సైమా అనే యువతిని గాఢంగా ప్రేమించాడు. ఎనిమిది నెలలపాటు వీరి ప్రేమ వ్యవహారం బాగానే సాగింది. సడెన్ గా.. సైమా.. అంకిత్ కి బ్రేకప్ చెప్పేసింది. తనతో ఇంక రిలేషన్ కొనసాగించలేను అని చెప్పేసింది. అంకిత్ ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోలేదు.
ఇలా రెండు నెలలు గడిచాయి. తర్వాత అంకిత్ కి అసలు నిజం తెలిసింది. సైమాకి మరో అబ్బాయితో పెళ్లి కుదిరిందని.. అందుకే తనకు బ్రేకప్ చెప్పిందని తెలుసుకున్నాడు. సరిగ్గా సైమా పెళ్లి రోజు.. అందరిలాగానే తాను కూడా పెళ్లికి వెళ్లాడు. పెళ్లి వింధు భోజనం చేశాడు. అనంతరం వధూవరులతో సెల్ఫీ కూడా దిగాడు.
పెళ్లి మండపంలో అంకిత్ ని చూసి సైమా కంగారుపడింది. పెళ్లి ఆపుతాడేమోనని టెన్షన్ పడింది. అలా ఏమీ లేకుండా ఫోటో దిగడంతో ఏమిచెయ్యడులే అనుకుంది. కానీ అంకిత్ చాలా ప్లాన్డ్ గా అడుగుపెట్టాడు. గతంలో సైమాతో తనతో చేసిన మేసేజ్ లు, వాళ్లిద్దరూ దిగిన ఫోటోలు ప్రింట్లు తీయించి.. పెళ్లికి వచ్చిన బంధువులందరికీ పంచిపెట్టాడు. అనంతరం మండపం నుంచి బయటకు వచ్చేశాడు. తర్వాత ఎప్పుడూ సైమాని కలవలేదని ఇది నా స్టోరీ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది.