Indian Independence Day 2022: భారత స్వాతంత్య్రం గురించి చరిత్రలో లిఖించబడిన కొన్ని సంఘటనలు మీకోసం..

By Mahesh RajamoniFirst Published Aug 8, 2022, 5:30 PM IST
Highlights

Indian Independence Day 2022: ప్రతి ఏడాది ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా.. భారతదేశంలో 190 సంవత్సరాల బ్రిటిష్ పాలన ముగింపును గుర్తుచేసే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.  స్వాతంత్ర్య సమరయోధులు ఎన్నో ఏండ్ల పాటు పోరాడితే.. భారత దేశానికి స్వతంత్ర్యం వచ్చింది. 
 


ఏ దేశానికైనా.. దాని స్వాతంత్ర్య దినోత్సవం ఎప్పుడూ చిరస్మరణీయంగానే ఉంటుంది.  వారి దేశం సాధించగలిగిన కీర్తిని గుర్తుచేసుకునే రోజు అది. అంతేకాదు స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు వదిలిన మహా మహనీయుల త్యాగాలను, వారి సహకారాన్ని, యుద్ధాలను గుర్తుంచుకునే రోజు కూడా ఇదే. 1947 నుంచి నేటి వరకు ముందుకు సాగడానికి,  రాజకీయంగా, ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా మారడానికి సహాయపడిన ప్రజలందరికీ తగిన గుర్తింపునిస్తూ.. అమర వీరులను స్మరించుకుంటూ భారతీయులు ఈ రోజును జరుపుకుంటారు. 2022 లో భారతదేశం 76 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

భారత స్వాతంత్ర్య దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర..

1757లో ప్లాసీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించడంతో భారతదేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైంది. ఇది వారికి మన దేశంపై పూర్తి నియంత్రణను ఇచ్చింది. ఈస్టిండియా కంపెనీ భారతదేశాన్ని దాదాపు ఒక శతాబ్దం పాటు పరిపాలించింది. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా 1857-58 లో భారతీయులు తిరుగుబాటు చేశారు. దీన్ని మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అంటారు. 

భారతదేశానికి ఎప్పుడు స్వాతంత్ర్యం వచ్చింది: 1947 ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది.

మొదటి భారత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ఏమిటి?

మన మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక ప్రసంగం చేశారు. "అర్ధరాత్రి ప్రపంచం నిద్రపోతున్నప్పుడు భారతదేశ జీవితం, స్వేచ్ఛపై మేల్కొంటుంది."

భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు కొన్ని వాస్తవాలు 

  • 1950లో భారత జాతీయ గీతాన్ని స్వీకరించారు.
  • 1906లో తొలిసారిగా భారత పతాకాన్ని ఎగురవేశారు.
  • లార్డ్ మౌంట్ బాటన్ ఆగస్టు 15ను భారత స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించాడు.
  • మన జాతీయ గీతం వందేమాతరం ఒక నవల నుంచి ప్రేరణ పొందింది
  • 1947 ఆగస్టు 17న రాడ్ క్లిఫ్ రేఖ మొదటిసారిగా ప్రచురించబడింది
  • భారత జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు
  • భారత త్రివర్ణ పతాకం స్వరాజ్య పతాకంపై ఆధారపడి ఉంటుంది.

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు?

  • ప్రతి  స్వాతంత్ర్య దినోత్సవాన్ని జాతీయ జెండా ఎగురవేసి.. జాతీయ గీతం పాడి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటారు.  అంతేకాదు విన్యాసాలు నిర్వహించబడతాయి.
  • దేశాన్ని, దేశ సంస్కృతిని గౌరవించడానికి జాతీయ లేదా ప్రాంతీయ వేషధారణలో దుస్తులు ధరిస్తారు. 
  • స్వాతంత్ర్య దినోత్సవం నాడు గాలిపటం ఎగరడం కూడా ఒక సంప్రదాయం. ఆ రోజున మనం పొందిన స్వాతంత్య్రానికి చిహ్నంగా అన్ని వయస్సుల వారు గాలిపటాలను ఎగురవేస్తారు.
  • పాత ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సైనిక బలగాలు, పోలీసులతో జెండా ఎగురవేసే కార్యక్రమం ఉంటుంది. కవాతులో ప్రధాని పాల్గొంటారు.
click me!