అష్ట కష్టాలపై నిర్లక్ష్యం: ప్రాణాంతక వ్యాధికి సంకేతం

First Published Aug 2, 2018, 11:42 AM IST
Highlights

మీ శరీరంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. కొన్నిసార్లు మీకు గుర్తు తెలియని నొప్పి, అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. 

అకస్మాత్తుగా తలనొప్పి, నిరంతరం అలసిపోయినట్లు ఉండటం, శ్వాస మందగించడం వంటి లక్షణాలు మీ శరీరంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. కొన్నిసార్లు మీకు గుర్తు తెలియని నొప్పి, అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. కొన్నిసార్లు వైద్య నిపుణులు నిర్వహించే పరీక్షల్లోనూ వాస్తవ పరిస్థితులు బయటపడవు. కనుక మీలో లక్షణాలు చెక్ చేసుకుంటే పరిస్థితి తీవ్రతను తెలియజేస్తాయి. ఆ లక్షణాలేమిటో పరిశీలిద్దాం..

తీవ్ర తలనొప్పి ఇలా 
ప్రతి ఒక్కరికి తలనొప్పి రావడం సీరియస్ కాదు. ఒకవేళ తీవ్రమైన తలనొప్పి అకస్మాత్‌గా వస్తే మాత్రం పరిస్థితి చాలా సీరియస్‌గా ఉన్నట్లే. రక్తనాళాలు ఉబ్బి పోవడానికి, రక్తనాళాలు బద్దలు కావడానికి కారణం కావచ్చు. మెదడులోని రక్త నాళాలు పగిలితే ప్రాణానికే ముప్పు

ఛాతిలో నొప్పి అంటే..
ఛాతీలో నొప్పి అన్ని వేళ్లలా కాకపోయినా కొంత మేరకు మీ గుండెకు ఇబ్బందిక పరిస్థితులు తలెత్తుతాయి. రక్తం గడ్డకట్టిపోవడం, ఛాతీ బద్దలైంది. అన్న వాహిక అంటుకుపోయి ఉండొచ్చు.  ఛాతీలో నొప్పి వల్ల నిస్సత్తువ, వాంతులు, చల్ల చెమట తలెత్తుతుందని నిపుణులు తెలిపారు. 

ఒక కంటిలో అంధత్వం
ఒక కంటి చూపు నిలిచిపోతే గుండెపోటుకు దారి తీయొచ్చు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో శరీరంలో ఒకవైపు సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. 

శ్వాస మందగింపు
ఒకవేళ శ్వాసలో అప్పటికప్పుడు మందగమనం తలెత్తుతుంది. ఊపిరితిత్తులకు వెళ్లే సిరల్లో రక్త నాళాల్లో రక్తం గడ్డ కడుతుంది. లేదా కార్డియో వాస్కులర్ సమస్యలు తలెత్తుతాయి. 

నిరంతరం అలసట
ఒక రోజు తర్వాత పూర్తిగా అలసిపోయినట్లు కనిపించొచ్చు. అన్నివేళ్లలో అలసటకు గురైతే అది గుండెపోటుకు సంకేతంగా భావిస్తున్నారు. 

అకస్మాత్‌గా బరువు పెరుగుదల లేదంటే తగ్గుదల
అకస్మాత్‌గా శరీరంలో బరువు పెరిగినా, తగ్గినా సరైన కారణం ఉండదు. అది క్యాన్సర్ వ్యాధికి దారి తీస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ అతిగా స్పందించడంతోగానీ, లివర్ సంబంధ వ్యాధులకు గానీ దారి తీస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.

వాంతులు
ప్రతిరోజూ తిన్న వెంటనే వాంతులు జరిగితే స్టమక్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లే. ఇతర కారణాలతో అంటే తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్, పిత్తాశయ వ్యాధితో ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

నిరంతరం దగ్గు
నిరంతరం దగ్గుతో బాధపడుతూ ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మీరు బాధపడుతున్నట్లే. ఇది న్యూమొనియాకు సంకేతం కావచ్చు. దగ్గు తెమడతో రక్తం రావడం ఇన్‌పెక్షన్ ఎదుర్కొంటున్నట్లే.  

click me!