కాకరకాయ చేదుతో ఇబ్బంది పడుతున్నారా? కాకరకాయ చేదును తగ్గించి రుచి పెంచడానికి 5 సూపర్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఉప్పు, నిమ్మరసం, పెరుగు, మసాలా దినుసులతో రుచికరమైన కాకరకాయ వంటకాలు తయారు చేసుకోండి.
కాకరకాయ చేదు ఎలా తగ్గించాలి:
కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఎవరూ తినడానికి ఇష్టపడరు. తినడం కాదు, అసలు చాలామంది కాకరకాయని చూడగానే ముఖం చిట్లిస్తారు, దాన్ని తినడానికి ఇష్టపడరు. కానీ, కాకరకాయ మన కు చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే దాన్ని మన ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి. కానీ, కాకరకాయ రుచికి చేదుగా ఉంటుంది. ఎలా వండినా కూడా ఆ చేదు పోదు అనే భావన చాలా మందిలో ఉంటుంది. చేదు తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల మసాలాలు వేస్తూ ఉంటారు. కానీ, అయినా కూడా చేతు తగ్గలేదు అనుకుంటారు. అలాంటివారు కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే చేదు తగ్గించుకోవచ్చు.
కాకరకాయ చేదు తగ్గించడానికి 5 చిట్కాలు
కాకరకాయ చేదు తగ్గించాలంటే, దాన్ని సరిగ్గా కోయాలి. కాకరకాయ పండి ఉంటే, దాని గింజలు చేదుగా ఉంటాయి. కాబట్టి, కాకరకాయని కోసేటప్పుడు గింజలు, గట్టి భాగాన్ని తీసేయాలి. దీనివల్ల చేదు చాలావరకు తగ్గుతుంది.
2. ఉప్పుతో శుభ్రం చేయడం
కాకరకాయ ముక్కలకు ఉప్పు రాసి 15-20 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత, చేత్తో పిండి నీళ్ళు తీసేయాలి. దీనివల్ల కాకరకాయ చేదు తగ్గుతుంది. కావాలంటే.. కాకరకాయ పై భాగాన్ని లైట్ గా తీసేసి కూడా వండుకోవచ్చు.
3. నిమ్మరసం లేదా పెరుగులో నానబెట్టడం
మసాలా కాకరకాయ వండాలనుకుంటే, కాకరకాయ ముక్కలను నిమ్మరసం లేదా పెరుగులో అరగంట నానబెట్టాలి. దానిపై ఉప్పు, కారం చల్లుకోవాలి. దీనివల్ల కాకరకాయ రుచి పెరుగుతుంది, చేదు తగ్గుతుంది, బాగా మ్యారినేట్ అవుతుంది.
4. కాకరకాయని బ్లాంచ్ చేయడం
కాకరకాయని వండే ముందు, దాని ముక్కలను వేడి నీళ్ళలో 5-7 నిమిషాలు ఉడికించాలి (బ్లాంచ్ చేయాలి). దీనివల్ల చేదు తగ్గుతుంది. తర్వాత, నీళ్ళు పిండి, మసాలా లేదా గ్రేవీలో వాడుకోవాలి.
5. మసాలాలతో వేయించడం
కాకరకాయని ఉల్లిపాయలు, అమ్చూర్, సోంపు, ఇంగువ, బెల్లం వంటి మసాలాలతో బాగా వేయించాలి. దీనివల్ల కాకరకాయ రుచి పెరుగుతుంది, చేదు తగ్గుతుంది. క్రిస్పీ కాకరకాయ కోసం, కాకరకాయని సన్నగా తరిగి ఎండలో కొద్దిసేపు ఆరబెట్టాలి. దీనివల్ల కాకరకాయ క్రిస్పీగా ఉంటుంది, చేదు కూడా తగ్గుతుంది.