వంట చేసేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే

ప్రతి వంటకు వేర్వేరు రుచులు ఉంటాయి. ఫ్రై, గ్రిల్, వేడి చేయడం, మరిగించడం ఇలా రకరకాల పద్దతుల్లో వంట చేస్తాం..

 

 

Google News Follow Us

వంట చేసేటప్పుడు చాలా రకాల సామాగ్రి అవసరం అవుతుంది. ప్రతి వంటకానికి వేరే వేరే రుచులు ఉంటాయి. ఫ్రై, గ్రిల్, వేడి చేయడం, మరిగించడం ఇలా రకరకాల పద్ధతుల్లో వంట చేస్తాం. ఆరోగ్యకరమైన వంట కోసం వంట చేసే పద్ధతిలో కూడా మార్పులు చేసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం. 

ఎయిర్ ఫ్రైయర్ వాడేటప్పుడు 

ఎయిర్ ఫ్రైయర్‌లో వంట చేయడం చాలా తేలిక. తక్కువ నూనె చాలు. వేడి గాలితో ఎయిర్ ఫ్రైయర్ పనిచేస్తుంది. ఇది ట్రాన్స్ ఫ్యాట్‌కి దారితీస్తుంది. దీనివల్ల వంట సరిగ్గా ఉడకకపోవచ్చు లేదా మరీ ఎక్కువగా ఉడికిపోవచ్చు.  

గ్రిల్లింగ్ 

గ్రిల్ చేయడం చాలా మందికి ఇష్టం. మాంసం, చేపలు, పనీర్ లాంటివి గ్రిల్ చేస్తాం. కానీ ఓపెన్‌గా ఎక్కువ వేడి మీద వండడం వల్ల హానికరమైన హెటెరోసైక్లిక్ అమైన్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ లాంటివి వస్తాయి. ఇవి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. 

నాన్‌స్టిక్ పాన్

నాన్‌స్టిక్ పాన్‌లో వంట చేయడం చాలా మందికి ఇష్టం. దీనికి పాలీటెట్రాఫ్లోరోఎథిలీన్ పూత ఉంటుంది. పాన్ మరీ ఎక్కువగా వేడి చేస్తే విషపూరిత పొగ, రేణువులు వచ్చే అవకాశం ఉంది.  

ఎక్కువగా ఉడకబెట్టకండి

వంటల్ని ఎక్కువగా ఉడకబెట్టడం మంచిది కాదు. దీనివల్ల పోషకాలు, రుచి పోతాయి, హానికరమైన పదార్థాలు వస్తాయి.   

 

Read more Articles on
click me!