
వినాయక చవితి నుంచి మళ్లీ సంక్రాంతి వరకు ప్రతి నెలా పెద్ద పండుగలు పలకరిస్తూనే ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్లు ఈ పండుగల కోసం బంగారు ఆభరణాలు కొనేందుకు ప్రయత్నిస్తారు. మీ ఇంట్లోని మహిళలకు అందమైన బహుమతి ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన బంగారు ఉంగరాలు తక్కువ ధరలోనే దొరకుతాయి. చీరతో పాటు ఉంగరం కూడా బహుమతిగా ఇస్తే మీ ఇల్లాలు పొంగిపోవడం ఖాయం. 2 గ్రాముల్లో 18 క్యారెట్ ఉంగరాలు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ వాడకానికి, పార్టీలకి సరిగ్గా సరిపోతాయి.. మీకు నచ్చిన డిజైన్ చెప్పి చేయించుకోవచ్చు లేదా రెడీమేడ్ ఉంగరాలు కొనొచ్చు. కొన్ని డిజైన్లు చూద్దాం.
18 క్యారెట్ లో లీఫ్ ప్యాటర్న్ ఉంగరం ఇది. రోజువారీ వాడకానికి ఈ ఉంగరం ఎంతో బాగుంటుంది. లీఫ్ డిజైన్ కూడా ఆడవారికి నచ్చుతుంది. వారిలాగే ఆకు కూడా సున్నితంగా ఉంటుంది. చూడటానికి బాగుండి, ఏ దుస్తులకైనా సరిపోయేలా ఉంటుంది. ఇది పెట్టుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఉంగరాలు వెతికి కొనేందుకు ప్రయత్నించండి.
పండగలకి స్టోన్స్ పొదిగిన ఉంగరాలు కూడా చాలా బాగుంటాయి. లీఫ్ ప్యాటర్న్ తో పాటు, రోజ్ డిజైన్లు కూడా వస్తున్నాయి. ఇవి మోడరన్ లుక్ ని ఇస్తాయి. 2 గ్రాముల్లోనే ఈ డిజైన్లు దొరుకుతాయి కాబట్టి బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. స్టోన్స్ కి బదులుగా డైమండ్స్ పెట్టించుకున్నా మంచివే.
ఈ ఉంగరం చూడండి ఎంత కళగా ఉందో… లీఫ్ తో పాటు, ఫ్లోరల్ డిజైన్లో కూడా వచ్చింది. ఇది ఎప్పటికైనా పాతబడని ఫ్యాషన్ డిజైన్. రోజువారీ వాడకానికి కూడా సరిపోతుంది. 2-3 గ్రాముల్లో ఈ డిజైన్ దొరుకుతుంది. మీ ఇంట్లోని ఆడవారికి ఇది నచ్చడం ఖాయం.
మల్టీలేయర్ ఉంగరాలు ఇప్పుడు ట్రెండీగా మారాయి. ఇవి చాలా అందంగా ఉంటాయి. చేతులకి నిండుదనాన్ని ఇస్తాయి. చీరలపై ఈ ఉండగరాలు మరింత అందంగా కనిపిస్తాయి. 18 క్యారెట్లలో చాలా డిజైన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.