సురేష్ టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను రిలిజ్ చేశారు. 23 మార్చి 2020 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు .
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. బుధవారం రోజున ఉదయం మంత్రి ఆదిమూలుపు సురేష్ టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను రిలిజ్ చేశారు. 23 మార్చి 2020 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు .
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
undefined
also read విద్యార్థులకు గుడ్ న్యూస్... తగ్గనున్న కాలేజీ ఫీజులు!
పదోవ తరగతి పరీక్ష 2020కి సిద్ధమవుతున్న విద్యార్థులు ఇంతకుముందు సంవత్సరాల పరీక్ష పేపర్‌లలో తరచూ అడిగే ప్రశ్నలు, ముఖ్యమైన అంశాలను నేర్చుకోవాలని నిపుణులు సూచించారు. అద్భుతమైన మార్కులు సాధించడానికి అటువంటి ముఖ్యమైన అంశాలపై సాధ్యమయ్యే అన్ని ప్రశ్నలను సిద్ధం చేయాలని కూడా వారు కొందరు సిఫార్సు చేస్తున్నారు.
విద్యార్థులు కూడా తాజా మోడల్ పేపర్‌లతో ప్రాక్టీస్ చేయాలని సూచిస్తున్నారు. తాజా పేపర్ల సహాయంతో, విద్యార్థులు నిస్సందేహంగా కొత్త పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోగలగుతారు.
పదో తరగతి 2020 పరీక్షల షెడ్యూల్ వివరాలు
మార్చి 23 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1
మార్చి 24 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
also read 10th తర్వాత ఏంటి?: కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీతో నిర్ణయం తీసుకోండి
మార్చి 26 : సెంకండ్ లాంగ్వేజ్
మార్చి 27 : ఇంగ్లిష్ పేపర్-1
మార్చి 28 : ఇంగ్లిష్ పేపర్-2
మార్చి 30 : గణితం పేపర్-1
మార్చి 31 : గణితం పేపర్-2
ఏప్రిల్ 01 : సైన్స్ పేపర్-1
ఏప్రిల్ 03 : జనరల్ సైన్స్ పేపర్-2
ఏప్రిల్ 04 : సోషల్ స్టడీస్ పేపర్-1
ఏప్రిల్ 06 : సోషల్ స్టడీస్ పేపర్-2
ఏప్రిల్ 07 : సంస్కృతం, అరబిక్, పెర్షియన్ సబ్జెక్ట్
ఏప్రిల్ 8 : ఒకేషనల్ పరీక్షలు