పెరుగుతున్న నిరుద్యోగం...700 ఉద్యోగాలకు 7,500 మంది దరఖాస్తు...

By Sandra Ashok Kumar  |  First Published Feb 8, 2020, 1:44 PM IST

హైదరాబాద్ నగరంలో జెఎన్‌టియుహెచ్, హైఎస్‌ఇఎ అధికారులు సంయుక్తంగా జాబ్ ఫెయిర్‌ ప్రారంభించారు.జాబ్ మేళాలో సుమారు 7,500 మంది నిరుద్యోగ ఇంజనీరింగ్, ఎంసిఎ గ్రాడ్యుయేట్లు ప్రైవేటు రంగంలో ఉన్న 700 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.


హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువవుతుంది. ప్రతి యేట ఎంతో మంది విద్యార్దులు డిగ్రీ, బీ-టెక్, ఎం‌బి‌ఏ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అవకపోవడంతో ఎంతో మంది ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారు.

also read బీటెక్‌, ఎంఫార్మసీలో కొత్త కోర్సులు...జేఎన్‌టీయూ ఆమోదం...

Latest Videos

undefined

కొందరు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడలేక ప్రైవేట్ ఉద్యోగాల కోసం  సిద్దం ఆవుతున్నారు.ఏళ్ల తరబడి కష్టపడి చదివి డిగ్రీ పట్టా పొంది ఉద్యోగాలు దొరకకా, ప్రభుత్వ నోటిఫికేషన్స్ వెలువడక ఎంతో మంది సాతమతమవుతున్నారు.

విరి కోసం కొన్ని ప్రైవేటు సంస్థలతో కలిసి హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైఎస్‌ఇఎ) సమన్వయంతో జెఎన్‌టియు - హైదరాబాద్ నిర్వహించిన జాబ్ మేళాలో సుమారు 7,500 మంది నిరుద్యోగ ఇంజనీరింగ్, ఎంసిఎ గ్రాడ్యుయేట్లు ప్రైవేటు రంగంలో ఉన్న 700 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.

also read విద్యార్థులకు గుడ్ న్యూస్... తగ్గనున్న కాలేజీ ఫీజులు!

ఈ జాబ్ ఫెయిర్ కోసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి దరఖాస్తుదారులు నమోదు చేసుకున్నారు. 7500 మంది దరఖాస్తుదారులలో 2000 మందిని ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ  ద్వారా షార్ట్‌లిస్ట్ చేశారు. జాబ్ ఫెయిర్‌లో ఇన్ఫోసిస్, సిటిఎస్, టెక్ మహీంద్రాతో సహా 58 కంపెనీలు 700 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. జాబ్ ఫెయిర్‌ను జెఎన్‌టియుహెచ్, హైఎస్‌ఇఎ అధికారులు సంయుక్తంగా ప్రారంభించారు.

click me!