కరోనాతో టీనేజర్స్ లో గొంతు పక్షవాతం ? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?

Published : Dec 26, 2023, 09:37 AM ISTUpdated : Dec 26, 2023, 09:46 AM IST
కరోనాతో టీనేజర్స్ లో గొంతు పక్షవాతం ? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?

సారాంశం

కరోనా పాజిటివ్ తేలిన  13 రోజుల తర్వాత తీవ్రమైన శ్వాససమస్యలు ఎదుర్కొంది. శ్వాస ఆడకపోవటంతో అత్యవసర విభాగానికి తరలించారు. ఇక్కడ ఆమెకు వోకల్ కార్డ్ పెరాలసిస్ డిటెక్ట్ అయిందని పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురించబడింది. 

కోవిడ్ 19 ఎఫెక్ట్ అయిన తరువాత వోకల్ కార్డ్ పక్షవాతం బారిన పడిన మొదటి పీడియాట్రిక్ కేసును పరిశోధకులు తెలిపారని ఓ కొత్త అధ్యయనం తెలిపింది. అమెరికాలోని మసాచుసెట్స్ ఐ అండ్ ఇయర్ హాస్పిటల్‌లోని ఫిజిషియన్-పరిశోధకులు పక్షవాతం అనేది వైరల్ ఇన్‌ఫెక్షన్ డౌన్ స్ట్రీమ్ ఎఫెక్ట్ అని.. ఇది పిల్లలు,పెద్దలలో నాడీ వ్యవస్థ సంబంధిత లేదా నరాలవ్యాధి సమస్యలకు సంబంధించి మరో కొత్త సమస్యగా మారొచ్చని నిర్ధారించారు.

ఓ 15 ఏళ్ల బాలిక SARS-CoV-2 బారిన పడింది. పెద్దగా సమస్యలేమీ లేవు. కానీ సడన్ గా కరోనా పాజిటివ్ తేలిన  13 రోజుల తర్వాత తీవ్రమైన శ్వాససమస్యలు ఎదుర్కొంది. శ్వాస ఆడకపోవటంతో అత్యవసర విభాగానికి తరలించారు. ఇక్కడ ఆమెకు వోకల్ కార్డ్ పెరాలసిస్ డిటెక్ట్ అయిందని పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురించబడింది. ఆమెకు ఆస్తమా, యాంగ్జటీ ఉందని ఆమె హెల్త్ హిస్టరీలో తేలింది. 

ఎండోస్కోపిక్ పరీక్షలో బయోలెట్రల్ వోకల్ కార్డ్ పెరాలసిస్ అని తేలింది. ఇది వాయిస్ బాక్స్ లేదా 'స్వరపేటిక'లో ఉండే రెండు స్వర తంతువులు కదలలేని స్థితిని సూచిస్తుందని పరిశోధకులు తెలిపారు.

పొంచి ఉన్న మరో మహమ్మారి ‘జోంబీ డీర్ డిసీజ్’.. మనుషులు జాంబీల్లా మారతారా?

"ఈ వైరస్ పిల్లలలో చాలా సాధారణమైనది. ఇటీవల కోవిడ్ 19 బారిన పడిన తరువాత శ్వాస తీసుకోవడం, మాట్లాడటం లేదా మింగడం వంటి సమస్యల బారిన పడినఏ పిల్లలలోనైనా ఈ కొత్తగా గుర్తించబడిన సమస్యను పరిగణలోకి తీసుకోవాలి" అని చెబుతున్నారు. "ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఆస్తమా వంటి సాధారణ రోగ నిర్ధారణలకు కూడా ఇవే లక్షణాలుండడంతో పొరబడుతుంటారు" అని డాక్టర్ లారో చెప్పారు.

ఆసుపత్రిలో ఉన్నప్పుడు, రోగి బ్లడ్ వర్క్, ఇమేజింగ్, సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ విశ్లేషణ, ఓటోలారిన్జాలజీ (చెవి, ముక్కు, గొంతు వ్యాధులతో వ్యవహరించే ఔషధాల స్పెషాలిటీ), న్యూరాలజీ, సైకియాట్రీ, స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీతో సహా సవివరమైన రోగనిర్ధారణ పరీక్షలను చేయించారని న్యూరో సర్జరీ, పరిశోధకులు చెప్పారు.

రోగి లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో స్పీచ్ థెరపీ విఫలమైనప్పుడు, వైద్యులు ట్రాకియోస్టోమీని నిర్వహించారు. రోగి శ్వాస ఇబ్బందులను తగ్గించడానికి శస్త్రచికిత్స ద్వారా శ్వాసనాళంలో సమస్యను సరిచేశారు.  కోవిడ్-19 వ్యాక్సిన్ ఆకస్మిక మరణాలకు దోహదం చేయదని ICMR అధ్యయనం తెలిపింది.

ప్రాథమిక చికిత్స తర్వాత ఆమె 13 నెలలకు పైగా ట్రాకియోస్టోమీపై ఆధారపడి ఉందని వారు నివేదించారు, ఈ రకమైన నరాల సమస్య తాత్కాలికంగా ఉండకపోవచ్చని సూచించారు. కేసు నివేదిక సమర్పణ తర్వాత, పదిహేను నెలల తర్వాత దాన్ని తొలగించగలిగామని వారు చెప్పారు.

దీనిని "అత్యంత అసాధారణమైనది"గా అభివర్ణిస్తూ, కోవిడ్-19 కారణంగా చాలా మంది పెద్దలు ఈ సమస్యను చెప్పినప్పటికీ, ఇది యుక్తవయస్సులో పోస్ట్-వైరల్ న్యూరోపతికి దారితీసిన మొదటి కేసు అని బృందం తెలిపింది. 

"పిల్లలు వాస్తవానికి COVID-19 నుండి దీర్ఘకాలిక న్యూరోట్రోఫిక్ ప్రభావాలను కలిగి ఉంటారనేది వాస్తవం. పిల్లలను బాగా చూసుకోవడానికి విస్తృత పీడియాట్రిక్ కమ్యూనిటీ తెలుసుకోవడం చాలా ముఖ్యం" అని సీనియర్ రచయిత క్రిస్టోఫర్ హార్ట్నిక్ చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే