నైజీరియాలో సాయుధ మూకల కాల్పులు..  160 మంది మృతి..

By Rajesh Karampoori  |  First Published Dec 26, 2023, 5:37 AM IST

Nigeria Attack: ఆఫ్రికన్ దేశం నైజీరియాలో జరిగిన హింసాత్మక దాడుల్లో మొత్తం 160 మంది మృతి చెందారు. అలాగే.. 300 మందికి పైగా గాయపడ్డారు. వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాధారణంగా సెంట్రల్ నైజీరియాలో పశువుల కాపరులు, రైతుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి. మే తర్వాత ఇంతటి తీవ్ర హింస కనిపించడం ఇదే తొలిసారి. 


Nigeria Attack:  సెంట్రల్ నైజీరియాలో గ్రామాలపై సాయుధ మూకలు జరిపిన వరుస కాల్పుల్లో 160 మందిని మృతి చెందారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ అధికారులు సమాచారం వెల్లడించారు. అనేక సంవత్సరాలుగా మతపరమైన,  జాతి ఉద్రిక్తతలతో ఈ ప్రాంతం రగిలిపోతుంది. దీంతో బందీపోట్లుగా భావించే సాయుధ మూకలు కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా చేసుకుని వారు నివసించే గ్రామాలపై దాడి చేసి కాల్పులకు తెగబడ్డాయి. ఈ క్రమంలో వారి ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలు గురి చేస్తాయి. 

ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో కేవలం 16 మంది మరణించినట్లు సైన్యం వెల్లడించింది. కానీ.. ఈ మారణకాండ సోమవారం కూడా కొనసాగడంతో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది మరో 300 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని, వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతాల్లో మతపరమైన, సామాజిక పరమైన విబేధాల వల్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సాయుధ మూకలు కాల్పులకు తెగబడ్డాయి. 

Latest Videos

undefined

శని, ఆదివారాల్లో జరిగిన దాడుల్లో 113 మంది మృతి చెందినట్లు స్థానిక ప్రభుత్వ ఏరియా యాక్టింగ్‌ చైర్మన్‌ కసా తెలిపారు. ఈ దాడులు డకాయిట్‌లు చేశారని, ఇందులో 300 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. వాస్తవానికి ఉత్తర, మధ్య రాష్ట్రంలో పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణలు జరుగుతాయి. మే నుంచి ఇక్కడ హింసాత్మక ఘటనలు పెరిగాయి. కాపు కాపరుల దాడుల్లో వందలాది మంది చనిపోయారని తెలిపారు.

ఈ దాడులకు ఎవరు పాల్పడ్డారనే దానిపై అధికారులు సమాచారం ఇవ్వలేదు. రాష్ట్ర పోలీసు ప్రతినిధి నుండి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. నైజీరియాలో అనేక జాతులు, మత వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. నైజీరియా మిడిల్ బెల్ట్‌గా పిలువబడే సెక్టారియన్ వివాదం ఇటీవలి సంవత్సరాలలో వందల మంది ప్రాణాలను బలిగొంది. ఇది తరచుగా ముస్లిం పశువుల కాపరులు, క్రైస్తవ రైతుల మధ్య జాతి-మత వివాదంగా వర్ణించబడింది. కానీ వాతావరణ మార్పు  వ్యవసాయం పెరగడం కూడా దాని ప్రధాన కారకాలు.

click me!