Viral Video: అందరూ చూస్తుండగానే గన్ షాట్.. దారుణ హ‌త్య‌కు గురైన ట్రంప్ స‌న్నిహితుడు. వీడియో

Published : Sep 11, 2025, 07:59 AM IST
donald trump closest friend charlie kirk shot dead

సారాంశం

అమెరికాలో దారుణ సంఘ‌ట‌న జ‌రిగింది. ట్రంప్‌కి స‌న్నిహితుడిగా పేరుగాంచిన క‌న్‌స‌ర్వేటివ్ కార్య‌క‌ర్త చార్లీ కిర్క్ హ‌త్య‌కు గురికావ‌డం యావ‌త్ ప్ర‌పంచాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. ఈ హ‌త్య‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. 

ప్రసంగం మధ్యలో దారుణం

అమెరికాలో మరోసారి రాజకీయ హింస చెలరేగింది. ట్రంప్‌కి ఆప్తుడిగా పేరుగాంచిన కన్‌సర్వేటివ్‌ కార్యకర్త చార్లీ కిర్క్‌ (32) హత్యకు గురయ్యారు. ఉటా కౌంటీ వర్సిటీలో జరిగిన చర్చా కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా తూటా దూసుకొచ్చింది. క్షణాల్లోనే ఆయన నేలపై కుప్పకూలగా, అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన అమెరికా వ్యాప్తంగా ఆందోళన రేపింది.

యువతలో ప్రభావం చూపిన నేత

1993లో ఇల్లినాయ్ రాష్ట్రంలోని అర్లింగ్టన్ హైట్స్‌లో జన్మించిన చార్లీ కిర్క్, కేవలం 18 ఏళ్లకే టర్నింగ్ పాయింట్ యూఎస్‌ఏ అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఆయన విద్యార్థులకు వ్యక్తిగత బాధ్యత, స్వేచ్ఛా మార్కెట్లు, పరిమిత ప్రభుత్వ జోక్యం వంటి భావజాలాన్ని పరిచయం చేశారు. “ప్రూవ్ మీ రాంగ్” అనే చర్చా వేదికతో కాలేజీల్లో ప్రత్యక్ష వాదోపవాదాలు నిర్వహించారు. 2019లో ప్రారంభించిన పోడ్‌కాస్ట్ ద్వారా ఆయన అభిప్రాయాలను నేరుగా యువతకు చేరవేశారు.

 

 

ట్రంప్ సంతాపం

చార్లీ కిర్క్ మరణంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనను “అద్భుతమైన వక్త, యువతకు ప్రేరణ”గా పేర్కొన్నారు. హత్య వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కిర్క్ స్మారకార్థం దేశవ్యాప్తంగా జెండాలను సగం ఎగరేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చార్లీకి భార్య ఎరికా కిర్క్ (మాజీ మిస్ అరిజోనా యూఎస్‌ఏ), ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కన్జర్వేటివ్ భావజాలం

చార్లీ కిర్క్ అనుసరించిన కన్జర్వేటివ్ సిద్ధాంతం పాత సంప్రదాయాలు, కుటుంబ విలువలు, మత విశ్వాసాలు, దేశభక్తిని కాపాడే దిశగా ఉంటుంది. ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలని, వ్యాపారాలు స్వేచ్ఛగా నడవాలని, వ్యక్తిగత బాధ్యత పెరగాలని వీళ్లు నమ్ముతారు. ఈ సిద్ధాంతం ట్రంప్, కిర్క్‌లను మరింత దగ్గర చేసింది.

హ‌త్య వెన‌కాల ఎవ‌రున్నారు.?

హత్య వెనుక ఎవరు ఉన్నారు, కారణం ఏమిటి అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. సోషల్ మీడియాలో కొన్ని పేర్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారాలు వాటిని ధృవీకరించలేదు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కానీ ఆ వ్యక్తి వివరాలు బయటపెట్టలేదు. ఇదే సమయంలో వర్సిటీ వద్ద ఒక వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే