అమెరికా వెళ్లేవారికి గుడ్ న్యూస్.. విదేశీ ప్రయాణికులకు బైడెన్ ప్రభుత్వం కోవిడ్-19 నూతన మార్గదర్శకాలు ఇవే..

By team telugu  |  First Published Oct 26, 2021, 12:56 PM IST

అగ్రరాజ్యం అమెరికా విదేశీ ప్రయాణికులపై ఉన్న ట్రావెల్ రిస్ట్రిక్షన్‌ను సడలించింది. ఈ మేరకు సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. 


కరోనా వైరస్ తీవ్రత తగ్గడంతో చాలా దేశాలు విదేశాలకు విమాన సర్వీసులను కొనసాగిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో ఉన్న నిబంధనలను కూడా సడలిస్తున్నాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికా విదేశీ ప్రయాణికులపై ఉన్న ట్రావెల్ రిస్ట్రిక్షన్‌ను (US travel restrictions ) సడలించింది. ఈ మేరకు సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కొత్త నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. చైనా, భారత్, యూరప్‌లోని కొన్ని దేశాలపై విధించిన కఠిన నిబంధనలను ఎత్తివేశారు. తాజా మార్గదర్శకాల ప్రకారం పూర్తిగా టీకాలు (Fully Vaccinated) వేయించుకన్న విదేశీ ప్రయాణికులను అమెరికాలోకి అనుమతించనున్నారు. విమానం ఎక్కే ముందు ప్రయాణికులు వారి టీకా స్థితికి సంబంధించిన రుజువును అందించాలి. అయితే పిల్లలకు మాత్రం టీకా వేయించుకోవడం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నిబంధనలు నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. 

విదేశీ ప్రయాణికులు అధికారిక వర్గాలు ధ్రువీకరించిన వ్యాక్సిన్ డాక్యూమెంట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ప్రయాణ తేదీకి రెండు వారాల ముందు చివరి డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులు బోర్డింగ్‌ సమయానికి ముందు మూడు రోజుల్లోపు తీసుకున్న కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్‌ను కూడా జత చేయాల్సి ఉంటుంది. 

Latest Videos

undefined

Also read: జగన్ సర్కార్ కీలక ఉత్వర్వులు.. ఆ కుటుంబాలకు రూ.50 వేలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ఇక, రెండేళ్ల లోపు పిల్లలకు ఎలాంటి పరీక్షలు చేయించాల్సిన అవసరం లేదు. 2 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ప్రయాణించడానికి ముందు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. పిల్లలు పూర్తిగా టీకాలు వేయించుకోకపోతే, పూర్తిగా టీకాలు వేసిన పెద్దవారితో ప్రయాణిస్తున్నట్లయితే.. బయలుదేరడానికి ముందు మూడు రోజులలోపు తీసిన నెగిటివ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి.

Also read: ఆర్యన్ ఖాన్ కేసులో మరో మలుపు.. ఢిల్లీకి ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే.. అలాంటిది ఏం లేదని వెల్లడి..

అదేవిధంగా టీకాలు వేయించుకుని ప్రయాణికులు అమెరికాకు ప్రయాణించడానికి ఒక్క రోజు‌లోపు తీసుకున్న కోవిడ్‌ నెగిటివ్ సర్టిఫికేట్‌ను అందజేయాలి. ఇది యూఎస్ పౌరులకు, చట్టబద్దమైన శాశ్వత నివాసితులు, వినహాయింపు పొందిన విదేశీ పౌరులకు వర్తించనుంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ కూడా.. అమెరికా పౌరులు, విదేశీయులు.. ప్రయాణానికి ముందు పూర్తిగా వ్యాక్సినేషన్ చేసుకున్న సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుందని సూచించింది. 

ఇక, అమెరికాకు ప్రయాణించేవారు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిబడిన టీకాలు గానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించబడిన టీకాలు గానీ వేయించుకోవాల్సి ఉంటుందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో ఉన్నవాటిని కూడా అంగీకరించనున్నట్టుగా పేర్కొంది. మార్గదర్శకాల ప్రకారం ఆమోదం మిక్స్‌డ్ డోసులు పొందిన వారిని కూడా అనుమతించనున్నట్టుగా తెలిపింది.

click me!