శ్రీలంక నౌకాదళంతో కలిసి విన్యాసాలు.. కొలంబోకి చేరుకున్న భారత నౌకలు

By Siva KodatiFirst Published Oct 24, 2021, 10:50 PM IST
Highlights

విదేశీ శిక్షణలో భాగంగా భారత నౌకాదళంలోని (indian air force) 1వ ట్రైనింగ్ స్క్వాడ్రన్‌కు చెందిన నౌకలు అక్టోంబర్ 24 నుంచి 28 వరకు శ్రీలంకను (sri lanka) సందర్శిస్తున్నాయి. ఇండియన్ నేవీ షిప్స్ మాగర్, శార్దూల్‌‌లు కూడా ఈ బృందంలో వున్నాయి

విదేశీ శిక్షణలో భాగంగా భారత నౌకాదళంలోని (indian air force) 1వ ట్రైనింగ్ స్క్వాడ్రన్‌కు చెందిన నౌకలు అక్టోంబర్ 24 నుంచి 28 వరకు శ్రీలంకను (sri lanka) సందర్శిస్తున్నాయి. ఇండియన్ నేవీ షిప్స్ మాగర్, శార్దూల్‌‌లు కూడా ఈ బృందంలో వున్నాయి.

 

 

సీనియర్ ఆఫీసర్, 1 వ ట్రైనింగ్ స్క్వాడ్రన్‌లు కొలంబో వచ్చారు. అయితే ఇండియన్ నేవీకి చెందిన సుజాత, తరంగిణి, సుదర్శిని విక్రమ్‌లు 24 అక్టోబర్‌ నాడు ట్రింకోమలీ నౌకాశ్రయంలోకి ప్రవేశించాయి.

 

 

ఈ పర్యటనలో నౌకలు ద్వైపాక్షిక శిక్షణతో పాటు సెయిల్ ట్రైనింగ్ క్యాప్సూల్స్‌ను శ్రీలంక నేవీ కోసం చేపట్టాయి. సంబంధిత నౌకాశ్రయాల నుండి బయలుదేరే ముందు శ్రీలంక నావికాదళానికి చెందిన నౌకలతో జాయింట్ ఎక్సర్‌సైజ్‌లో కూడా ఈ నౌకలు పాల్గొంటాయి.

 


 

click me!