భారత్‌లో ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు : పౌరులకు అమెరికా ప్రభుత్వం అడ్వైజరీ

By Siva KodatiFirst Published Oct 7, 2022, 9:09 PM IST
Highlights

తమ దేశ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది అమెరికా ప్రభుత్వం. భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించవద్దని తమ హెచ్చరించింది. మార్కెట్లు, మాల్స్, ప్రభుత్వ ఆఫీసుల వద్ద దాడులు జరిగే అవకాశం వుందని హెచ్చరించింది. 

తమ దేశ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది అమెరికా ప్రభుత్వం. భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించవద్దని హెచ్చరించింది. జమ్మూకాశ్మీర్‌లోని లఢఖ్, లేహ్‌లో పర్యటించొద్దని వార్నింగ్ ఇచ్చింది. పర్యాటక ప్రాంతాల్లో అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. మార్కెట్లు, మాల్స్, ప్రభుత్వ ఆఫీసుల వద్ద దాడులు జరిగే అవకాశం వుందని హెచ్చరించింది. అలర్ట్‌గా వుండాలని తమ దేశ పౌరులకు సూచించింది. 

ఇకపోతే.. అమెరికా మరోసారి భారత్ విషయంలో తన ద్వంద్వ నీతిని బయటపెట్టుకుంది. భారత్‌లో అంతర్భాగమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను ఏజేకే (ఆజాద్ జమ్మూకాశ్మీర్) అని ప్రస్తావిస్తూ మనదేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్‌లోని అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్ పీవోకేను సందర్శించడంపై భారతదేశం శుక్రవారం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే అమెరికా నుంచి అడ్వైజరీ రావడం గమనార్హం. 
 

click me!