లాస్ వేగాస్ లో కత్తితో దుండగుడి హల్ చల్.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు..

By SumaBala BukkaFirst Published Oct 7, 2022, 9:33 AM IST
Highlights

లాస్ వేగాస్ లో కత్తిపోట్లు కలకలం రేపాయి. ఓ వ్యక్తి విచక్షణారహితంగా దాడికి దిగడంతో ఇద్దరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

లాస్ ఏంజిల్స్ : లాస్ వెగాస్ స్ట్రిప్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అనూహ్యంగా కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు యూఎస్ నగరంలో పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతం సాధారణంగా సందర్శకులతో రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం వేళ ఈ దాడి జరగడంతో స్థానికులు, పర్యాటకులు కత్తిపోట్లకు గురయ్యారు. 

లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన జేమ్స్ లారోచెల్ ఈ ఘటన మీద మాట్లాడుతూ, దాడి చేసిన వ్యక్తి పొడవాటి బ్లేడ్‌, పెద్ద కత్తిని ఉపయోగించాడని చెప్పుకొచ్చాడు. అంతేకాదు సడెన్ గా కత్తితో దాడి చేయడం మొదలు పెట్టాడు. ఎలాంటి గొడవ కానీ, వాగ్వాదం కానీ లేకుండానే ఈ దాడి మొదలయ్యిందని చెప్పుకొచ్చారు.  ముందు ఓ వ్యక్తిపై దాడి చేసిన తరువాత.. అతను కత్తితో పాటు వీధి చివరకు పరిగెత్తాడు. అక్కడ మిగతా వారిమీద దాడిచేస్తూ వీధిలో పరుగులు పెట్టాడని అన్నారు. 

కత్తిపోట్లకు గురైన వారిలో ఇద్దరు మరణించగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నామని లారోచెల్ చెప్పారు. దాడి తరువాత పారిపోతుంటే అక్కడి ప్రజలు అతడిని పట్టుకోవడానికి వెంబడించారు. నిందితుడిని సెక్యూరిటీ గార్డు, పోలీసు అధికారులు అడ్డుకునేవరకు వారు అతడిని పట్టుకోవడానికి వెంబడిస్తూనే ఉన్నారు. 

స్టూడెంట్ నెం.1 : ‘దయచేసి నాతో మాట్లాడొద్దు.. నేను పీహెచ్ డీ చేస్తున్నా’.. వైరల్ అవుతున్న పోస్ట్..

నిందుతుడి వయసు 30 ఏళ్లు గా పోలీసులు తెలిపారు. అతను హిస్పానిక్ వ్యక్తిగా అభివర్ణించారు. నిందితుడు లాస్ వెగాస్‌లో స్థానికంగా ఉంటున్నట్లుగా కనిపించడం లేదని పోలీసులు అంటున్నారు. కత్తిపోట్ల విషయం తెలిసిన వెంటనే మీడియా అక్కడికి చేరుకుంది. అప్పటికే దారుణ ఘటన జరిగిపోవడంతో.. కత్తిపోట్లకు గురైనవారికి మిగతావారు సహాయం చేస్తున్న దృశ్యాలను వారు ప్రసారం చేశారు. 

ఈ ఘటనతో లాస్ వెగాస్ స్ట్రిప్‌లోని ప్రాంతాలు, రిసార్ట్‌లు, వైన్ లాస్ వేగాస్, ది వెనీషియన్‌లతో సహా ప్రధాన కేంద్రాలన్నీ గురువారం మూతపడ్డాయి. ఘటనకు సంబంధించిన వివరాలను డిటెక్టివ్‌లు సేకరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు, సామూహిక కత్తిపోట్లు, గన్ ఫైర్ లో ఇటీవలి కాలంలో తరచుగా యునైటెడ్ స్టేట్స్‌లో జరుగుతున్నాయి. అనేకమంది అమాయకులు ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 

లాస్ వేగాస్ లో ఐదు సంవత్సరాలకు ముందు సామూహిక కాల్పుల ఘటన తరువాత ఇదే అదిపెద్ద ఘటనగా అక్కడివారు పేర్కొంటున్నారు. అక్టోబరు 1, 2017న మాండలే బే రిసార్ట్ ,  క్యాసినోలోని 32వ అంతస్తులో ఉన్న ఓపెన్ కంట్రీ మ్యూజిక్ కచేరీలో స్టీఫెన్ ప్యాడాక్ 1,000 రౌండ్లకు పైగా కాల్పులు జరపడంతో యాభై ఎనిమిది మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. నిందితుడు రిటైర్డ్ అకౌంటెంట్.. ధనవంతుడు. అతని పేరు ప్యాడాక్. పోలీసులు అతడిని పట్టుకోవడానికి వెళ్లేసరికి తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

click me!