నేపాల్ లో ఘోర ప్ర‌మాదం.. బారా న‌దిలో బస్సు పడి 16 మంది మృతి.. 35 మందికి గాయాలు..

By team teluguFirst Published Oct 7, 2022, 9:37 AM IST
Highlights

నేపాల్ లో బస్సు ప్రమాదం జరిగింది. దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న బస్సుల్లో ఓ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. 

నేపాల్‌లోని మాధేష్ ప్రావిన్స్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బారా జిల్లాలో ఓ బ‌స్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 16 మంది మృతి చెందారు. మ‌రో 35 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన జరిగినప్పుడు బస్సు నారాయణగఢ్ నుంచి బిర్‌గంజ్ వైపు వెళ్తోంది. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు దాదాపు 50 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

దేశ తొలి ప్రదాని జవహర్ లాల్ నెహ్రూ కారు డ్రైవర్ మోనప్ప గౌడ్ కన్నుమూత..

గాయపడిన బాధితులను వైద్య చికిత్స కోసం హెటౌడా, చురే హిల్, సాంచో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ‘ది రైజింగ్ నేపాల్’ వార్తాపత్రిక నివేదించింది. అయితే పలువురిని హెటౌడా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసు సూపరింటెండెంట్ బామ్‌దేవ్ గౌతమ్ తెలిపారని ‘మై రిపబ్లికా’ వార్తాపత్రిక పేర్కొంది.]

దేశ వ్యాప్తంగా విస్తారంగా వానలు.. నేడు ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాల‌కు అవ‌కాశం - ఐఎండీ

కాగా.. అక్టోబర్ 2న ఈస్ట్-వెస్ట్ హైవేపై బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు మృతి చెందారు. 36 మంది గాయపడ్డారు. నేపాల్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. దేశం ఎక్కువగా పర్వతాలతో కప్పబడి ఉండటం వ‌ల్ల ఇక్క‌డి ర‌హ‌దారులు చాలా ఇరుకుగా ఉంటాయి. దేశంలో బస్సు ప్రమాదాలు సాధారణంగా ఈ కార‌ణాల వ‌ల్ల‌నే జ‌రుగుతుంటాయి. 

Sixteen people died in a bus accident in Amlekhganj of Bara and more than 25 people are injured. pic.twitter.com/iWVAcVeE7g

— TPS.NP (@tps_np)
click me!