ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోంది.. అమెరికాలో ఇలా జరుగుతాయని నేనెప్పుడూ అనుకోలేదు - డొనాల్డ్ ట్రంప్

By Asianet NewsFirst Published Apr 5, 2023, 9:38 AM IST
Highlights

ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోందని, అమెరికాలో ఇలా జరుగుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా నరకం వైపు వెళ్తోందని వ్యాఖ్యానించారు. 

2016 ఎన్నికలకు ముందు జరిగిన నగదు కేసులో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న బైడెన్ ప్రభుత్వంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం నరకానికి వెళ్తోందని, ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోందని వ్యాఖ్యానించారు. తన ఫ్లోరిడా నివాసమైన మార్-ఎ-లాగో నుండి ఆయన మీడియా, తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మనం మన దేశాన్ని రక్షించుకోవాలి. అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని నేనెప్పుడూ అనుకోలేదు. మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్న వారి నుంచి రక్షించడమే నేను చేసిన ఒకే ఒక్క నేరం’’ అని అన్నారు. ఇది అమెరికాను దేశాన్ని అవమానించడమేనని అన్నారు.

మంచులో కూరుకుపోయిన వ్యక్తిని కాపాడిన సంచలన వీడియో వైరల్.. నిమిషాల్లో ప్రాణాలు నిలిపాడు

2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు నగదు చెల్లింపులకు సంబంధించి క్రిమినల్ అభియోగాలపై మాన్ హట్టన్ కోర్టులో విచారణ సందర్భంగా ట్రంప్ 34 నేరారోపణల్లో తాను నిర్దోషి అని వాదించారు. 2021 జనవరి వరకు నాలుగేళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ రిపబ్లికన్ అధ్యక్షుడు మాన్హాటన్ క్రిమినల్ కోర్టులో లొంగిపోవడానికి వచ్చారు. దీంతో ఆయనను అరెస్టు చేశారు.

అయితే అంతకు ముందే అమెరికా మార్క్సిస్ట్ థర్డ్ వరల్డ్ దేశంగా మారుతోందని ట్రంప్ తన మద్దతుదారులకు ఈమెయిల్ పంపారు. న్యాయవ్యవస్థ నిష్పాక్షికతను ఆయన ప్రశ్నించారు.‘‘ఈ రోజు మోర్న్ ది లాస్ ఆఫ్ జస్టిస్ ఇన్ అమెరికా. ఏ నేరం చేయనందుకు అధికార రాజకీయ పార్టీ అరెస్టు చేసే రోజు ఇది’’ అని అందులో ట్రంప్ రోట్ పేర్కొన్నారు.

నడి వీధిలో మహిళ ముక్కుకోసిన వ్యక్తి.. వేధింపుల కేసు పెట్టిందని మూడేళ్ల తరువాత ప్రతీకారం..

కాగా.. అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్టు కావడం ఇదే తొలిసారి. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫు మళ్లీ బరిలోకి దిగడానికి ఆయన ప్రణాళికలు వేస్తున్నారు. ఈ తరుణంలో ఆయనపై కేసులు కలకలం రేపుతున్నాయి. మాన్‌హటన్ కోర్టు ఈ విచారణ 2024 జనవరిలో ప్రారంభం అవుతుందని వివరించింది.

కేరళలో అమానుషం.. ఇంట్లో ప్రసవించి, పసికందుకు బట్టలో చుట్టి బకెట్ లో వదిలేసిన మహిళ...

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్‌లో రిపబ్లికన్ నేతగా బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, డొనాల్డ్ ట్రంప్‌ను ఓ కేసు వెంటాడుతున్నది. 2016 అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో ఆయన ఓ పోర్న్ స్టార్ నోరుతెరవకుండా ఉండటానికి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిపాడనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన కేసు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ కాళ్లకు చుట్టుకుంటున్నది. 

click me!