అరెస్టయిన తొలి అమెరికా అధ్యక్షుడు! నేనే తప్పూ చేయలేదు: కోర్టులో డొనాల్డ్ ట్రంప్

Published : Apr 05, 2023, 02:42 AM ISTUpdated : Apr 05, 2023, 02:54 AM IST
అరెస్టయిన తొలి అమెరికా అధ్యక్షుడు! నేనే తప్పూ చేయలేదు: కోర్టులో డొనాల్డ్ ట్రంప్

సారాంశం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు మాన్‌హటన్ కోర్టులో ఓ కేసు విచారణకు హాజరయ్యారు. ఆయనపై చేసిన 34 నేరారోపణలను ఆయన నిరాకరించారు. కోర్టులో విచారణ తర్వాత ఆయన తిరిగి వెళ్లిపోయారు. ఈ కేసులో విచారణ 2024 జనవరిలో ప్రారంభం అవుతుందని కోర్టు తెలిపింది. కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్టు అయిన తొలి నేత డొనాల్డ్ ట్రంప్.  

న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు మాన్‌హటన్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. తన ట్రంప్ టవర్ నుంచి కాన్వాయ్‌లో బయల్దేరిన డొనాల్డ్ ట్రంప్.. కోర్టుకు చేరుకున్నారు. అతన్ని అరెస్టు చేసి కోర్టులోకి తీసుకెళ్లారు. కోర్టులో విచారణకు హాజరయ్యారు. తనపై చేసిన 34 నేరారోపణలను ఆయన ఖండించారు. ఆ నేరాలను అంగీకరించలేదు. విచారణ అనంతరం, ఆయన తిరిగి ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌కు వెళ్లిపోయారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్టు కావడం ఇదే తొలిసారి. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫు మళ్లీ బరిలోకి దిగడానికి ఆయన ప్రణాళికలు వేస్తున్నారు. ఈ తరుణంలో ఆయనపై కేసులు కలకలం రేపుతున్నాయి. మాన్‌హటన్ కోర్టు ఈ విచారణ 2024 జనవరిలో ప్రారంభం అవుతుందని వివరించింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్‌లో రిపబ్లికన్ నేతగా బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, డొనాల్డ్ ట్రంప్‌ను ఓ కేసు వెంటాడుతున్నది. 2016 అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో ఆయన ఓ పోర్న్ స్టార్ నోరుతెరవకుండా ఉండటానికి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిపాడనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన కేసు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ కాళ్లకు చుట్టుకుంటున్నది. 

Also Read: ట్రంప్.. పోర్న్ స్టార్ కేసు: డేనియల్స్ ఎవరు? ట్రంప్ గురించి ఏమన్నది?.. ‘నేను విక్టిమ్ కాదు.. ఇష్టంగానే కలిశాం’

1. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికకావడానికి ముందే డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ టైకూన్. సంపన్నుడు. 2006 జులైలో నిర్వహించిన ఓ గోల్ఫ్ టోర్నమెంట్‌‌లో ట్రంప్.. అడల్ట్ ఫిలిం నటి స్టార్మీ డేనియల్స్‌ను కలుసుకున్నాడు. అప్పుడు పోర్న్ స్టార్ డేనియల్స్‌కు 27 ఏళ్లు, ట్రంప్‌కు 60 ఏళ్లు. ట్రంప్ మూడో భార్య మెలానియా కొడుకు బారన్‌కు జన్మనిచ్చింది. అయితే, ట్రంప్‌ను కలవడాన్ని డేనియల్స్ తన పుస్తకం ‘ఫుల్ డిస్‌క్లోజర్’లో ప్రస్తావించింది. ఆ పుస్తకం 2018లో ముద్రితమైంది.

2. ఆ పుస్తకంలో డేనియల్స్.. డొనాల్డ్ ట్రంప్ గురించి రాసింది. ‘అప్రెంటిస్’స్టార్‌(ట్రంప్!)ఆయన ఇంటిలో డిన్నర్ కోసం ట్రంప్ బాడీగార్డులో ఒకరు డేనియల్స్‌ను ఆహ్వానించినట్టు రాసుకుంది. ఆ తర్వాత శారీరకంగా ఆయనతో కలిసినట్టు పేర్కొంది. తన శృంగార జీవితంలో అసంతృప్తిగా ఆ ఘటన ముగిసిందని వివరించింది. ట్రంప్ దేహ రూపం బాగాలేదని రాసింది.

3. కాగా, ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. డేనియల్స్‌తో తాను ఎన్నడూ సెక్స్ చేయలేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కేవలం తన నుంచి డబ్బులు గుంజడానికే ఆమె ఈ ఆరోపణలు తెచ్చిందని పేర్కొన్నారు.

4. మళ్లీ 2016 సంవత్సరానికొస్తే.. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ బరిలో నిలిచారు. ఆ సమయంలో పోర్న్ స్టార్ డేనియల్స్ నోరు మూయడానికి, ట్రంప్ పై ఆరోపణలు (2006 విషయాలను మాట్లాడకుండా ఉండటానికి!) చేయకుండా ఉండటానికి ఆమెకు 1,30,000 అమెరికన్ డాలర్ల డబ్బు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ పర్సనల్ లాయర్ మైఖేల్ కోహెన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ పేమెంట్ క్యాంపెయిన్ ఫైనాన్స్ చట్టాలను ఉల్లంఘించిందా? అనేదే ఇక్కడ ప్రధానంగా విచారించాల్సి ఉన్నది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Benjamin Netanyahu : ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఏం చదువుకున్నారో తెలుసా?
Iran Israel War : దుబాయ్ లో 19 మంది భారతీయులు అరెస్ట్.. అసలేం జరుగుతోంది?