లండన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ లోకి ఓ వ్యక్తి తుపాకీ తూటాలు విసిరాడు. దీంతో అతడిని వెంటనే పోలీసులు చుట్టుముట్టారు. అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో చార్లెస్, ఆయన భార్య క్వీన్ కెమిల్లా ప్యాలెస్ లేరు.
బకింగ్ హామ్ ప్యాలెస్ మైదానంలోకి తుపాకీ తూటాలుగా భావించే వస్తువులను విసిరిన ఓ వ్యక్తిని లండన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కింగ్ చార్లెస్ - III పట్టాభిషేకానికి కొద్ది రోజుల ముందు ఇది చోటు చేసుకోవడంతో ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయితే నిందితుడిని మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో అరెస్టు చేశారు.
దారుణం.. ఐదుగురు చిన్నారులను బెదిరించి గ్యాంగ్ రేప్.. దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి..
ఈ పట్టాభిషేకం కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అలాంటి వేడకకు ఆతిథ్యం ఇచ్చే బకింగ్ హామ్ ప్యాలెస్ గేటు వద్దకు ఓ వ్యక్తి చేరుకొని, ప్యాలెస్ లోకి పలు వస్తువులు విసిరేశాడని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. దాడి చేసే ఆయుధం ఉందనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముందుజాగ్రత్తగా అనుమానాస్పద బ్యాగును పేల్చేశారు.
గూగుల్ కు రాజీనామా చేసిన ఏఐ గాడ్‌ఫాదర్ జెఫ్రీ హింటన్.. ఎందుకంటే ?
కాగా.. ఈ ఘటనపై మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ జోసెఫ్ మెక్ డొనాల్డ్ స్పందించారు. ఓ వ్యక్తి ప్యాలెస్ లోకి తుటాలు విసిరాడని చెప్పారు. కానీ కాల్పులు జరిగినట్టు గానీ, అధికారులు, ప్రజాప్రతినిధులకు గానీ ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. దీనిపై సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.
ఇంటర్నేషనల్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఏపీ వాసి ప్రతిభ.. బ్రాంజ్ మెడల్ సాధించిన పెంటేల హరికృష్ణ
ఈ ఘటన జరిగిన సమయంలో చార్లెస్, ఆయన భార్య క్వీన్ కెమిల్లా ప్యాలెస్ లో లేరని బ్రిటిష్ మీడియా పేర్కొంది. దీనిపై స్పందించేందుకు బకింగ్ హామ్ ప్యాలెస్ అధికారులు నిరాకరించారు. ఇది ఉగ్రవాద ఘటన అని పోలీసులు తెలిపారు. అనుమానితుడి మానసిక ఆరోగ్య చరిత్రపై దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టయిన వ్యక్తి ఒంటరిగా ఉండేవాడిని చెప్పారు.
మే 6వ తేదీన 70 ఏళ్ల తర్వాత బ్రిటన్ లో జరుగుతున్న తొలి పట్టాభిషేకానికి సన్నాహకంగా బకింగ్ హామ్ ప్యాలెస్ కు వెళ్లే మాల్ ను మూసివేశారు. పట్టాభిషేకంలో భాగంగా బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబ్బే వరకు జరిగే ఊరేగింపులో వేలాది మంది సైనికులు పాల్గొంటారు.