ఇక చాలు నాయనా.. 550 మంది పిల్లలకు జన్మనిచ్చిన వ్యక్తిని స్పెర్మ్ డొనేషన్ చేయొద్దని ఆదేశించిన కోర్టు..

By Asianet News  |  First Published Apr 29, 2023, 1:20 PM IST

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 550 మందికి తండ్రి అయిన ఓ వ్యక్తిని ఇక నుంచి వీర్యదానం చేయకూడదని కోర్టు హెచ్చరించింది. కోర్టు హెచ్చరికలను లెక్క చేయకుండా మళ్లీ వీర్యదానం చేస్తే రూ.90 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. 


ప్రపంచ వ్యాప్తంగా 550 మందికి పైగా పిల్లలకు తండ్రి అయిన వీర్య దాతను నిలువరించేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వీర్యం దానం చేయడానికి వీల్లేదని డచ్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. పురుషుడి వీర్యంతో బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి, ఓ న్యాయవాది బృందం ఈ వీర్యదాతపై దావా వేయడంతో కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. డచ్ క్లినికల్ మార్గదర్శకాల ప్రకారం ఒక దాత 12 కుటుంబాల్లో 25 కంటే ఎక్కువ పిల్లలకు తండ్రి కాకూడదని కోర్టు పేర్కొంది.

‘సోనియా గాంధీ విషకన్య.. ఆమె పాకిస్థాన్, చైనా ఏజెంట్’ - కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ వివాదాస్పద వ్యాఖ్యలు

Latest Videos

100 మంది పిల్లలకు తండ్రి అయిన 41 ఏళ్ల జోనాథన్ అనే వ్యక్తి 2017లో నెదర్లాండ్స్ లోని ఫెర్టిలిటీ క్లినిక్ లకు విరాళం ఇవ్వకుండా గతంలోనే నిషేధం విధించినట్లు వార్త సంస్థ డీడబ్ల్యూ తెలిపింది. అయినా అంతటితో ఆగకుండా విదేశాల్లో, ఆన్ లైన్ ద్వారా వీర్యాన్ని దానం చేస్తూనే ఉన్నాడు. వీర్య దాతలకు సెంట్రల్ రిజిస్టర్ లేకపోవడంతో ఈ నిబంధనలను ఆయన ఉల్లంఘించాడు.

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే ?

జొనాథన్ 2007లో వీర్యదానం చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 550 నుంచి 600 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అయితే గర్భం ధరించలేని జంటలకు సాయం చేయాలని తన క్లెయింట్ భావించాడని జోనథన్ తరఫు లాయర్ వాదించాడు. అయితే విరాళాల సంఖ్య, గర్భం దాల్చిన పిల్లల సంఖ్య గురించి ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే కాబోయే తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చాడని కోర్టు గుర్తించింది. వందలాది మంది సవతి సోదరులు, సవతి సోదరీమణులు ఉన్న ఈ బంధుప్రీతి నెటవర్క్ చాలా పెద్దదని పేర్కొంది.

ఈద్ రోజు మసీదుల వెలుపల నమాజ్ చేశారని 2 వేల మందిపై కేసులు.. యూపీలోని అలీగఢ్ పోలీసుల అభియోగాలు

‘‘ఈ తల్లిదండ్రులందరూ ఇప్పుడు తమ కుటుంబంలోని పిల్లలు వందలాది అర్ధ తోబుట్టువులతో ఒక పెద్ద బంధుత్వ నెట్ వర్క్ లో భాగమనే వాస్తవాన్ని ఎదుర్కొంటున్నారు. కానీ ఇలా కావాలని వారు అనుకోలేదు.’’ అని కోర్టు పేర్కొంది. దీని వల్ల పిల్లలు ప్రతికూల మానసిక, సామాజిక పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉందని కోర్టు భావించింది. దీని వల్ల ఈ బంధుత్వ నెట్ వర్క్ ను మరింత విస్తరించకూడదని పేర్కొంది. 

సీఎం కేసీఆర్ చేతిలో అవినీతిపరుల చిట్టా.. వచ్చే ఎన్నికల్లో ఆ 30 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేనట్టేనా ?

అలాగే వీర్యాన్ని దానం చేసిన అన్ని క్లినిక్ ల జాబితాను అందజేయాలని, వీర్యకణాలను నాశనం చేసేలా ఆదేశించాలని జోనాథన్ ను హేగ్ కోర్టు కోరింది. మళ్లీ విరాళం ఇవ్వడానికి ప్రయత్నిస్తే లక్ష యూరోల (రూ.90.95 లక్షలు) జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 
 

click me!