ఉక్రెయిన్‌ పై రష్యా క్షిపణి దాడి.. 22 మంది మృతి.. అపార్ట్ మెంట్ లోకి దూసుకెళ్లడంతో చిన్నారులు కూడా..

By Asianet NewsFirst Published Apr 29, 2023, 9:42 AM IST
Highlights

రష్యా ఉక్రెయిన్ పై క్షిపణి దాడులు చేయడంతో 22 మంది చనిపోయారు. ఇందులో ముగ్గురు చిన్నారులు కూడా విషాదకరం. ఈ క్షిపణుల్లో రెండు ఓ అపార్ట్ మెంట్ లోకి దూసుకెళ్లడంతో ఇంత భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. 

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. అమాయక పౌరులు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో దాదాపు 22 మంది చనిపోయారు. ఒక్క సారిగా 20కి పైగా క్రూయిజ్ క్షిపణులు, రెండు డ్రోన్‌లను పేల్చింది. శుక్రవారం రాత్రి సమయంలో జరిగిన ఈ దాడిలో రెండు క్షిపణులు అపార్ట్‌మెంట్ భవనంలోకి దూసుకెళ్లాయి. దీంతో అందులో ఉన్న అందరూ చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.

ఈద్ రోజు మసీదుల వెలుపల నమాజ్ చేశారని 2 వేల మందిపై కేసులు.. యూపీలోని అలీగఢ్ పోలీసుల అభియోగాలు

దాదాపు రెండు నెలల్లో ఉక్రెయిన్ రాజధాని కైవ్ పై రష్యా అనేక సార్లు క్షిపణి దాడులు నిర్వహించింది. ఇప్పటి వరకు కైవ్ పై జరిగిన క్షిపణి దాడులను ఉక్రెయిన్ వైమానిక దళం అడ్డకుందని స్థానిక ప్రభుత్వం తెలిపింది. ఇందులో 11 క్రూయిజ్ క్షిపణులు, రెండు మానవ రహిత వైమానిక వాహనాలు ఉన్నాయని పేర్కొంది. 

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే ?

కాగా.. తాజా దాడి సెంట్రల్ ఉక్రెయిన్ లోని తొమ్మిది అంతస్తుల నివాస భవనంపై జరిగాయి. ఇది కైవ్ కు దక్షిణంగా 215 కిలోమీటర్ల (134 మైళ్ళు) దూరంలోని ఉమన్ నగరంలో ఉన్నాయి. ఈ దాడిలో 20 మంది మరణించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో ఓ పసికందుతో పాటు, ఇద్దరు పదేళ్ల చిన్నారులు చనిపోయారని పేర్కొంది.

దారుణం.. కౌన్సెలింగ్ అని స్టేషన్ కు పిలిచి బాలుడిని తీవ్రంగా కొట్టిన ఎస్ఐ..

శిథిలాల కింద పడి 17 మందికి గాయాలు అయ్యాయని, ముగ్గురు పిల్లలను రక్షించామని ఉక్రెయిన్ నేషనల్ పోలీసులు తెలిపారు. తొమ్మిది మంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. క్రెమ్లిన్ ఉద్దేశపూర్వక బెదిరింపు వ్యూహంలో భాగంగానే ఇలాంటి దాడులు జరిగాయని ఉక్రెయిన్ అధికారులు, విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అయితే రాత్రిపూట ప్రయోగించిన ఈ లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులు ఉక్రెయిన్ మిలిటరీ రిజర్వ్ యూనిట్లు ఉన్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

click me!