బీబీసీ చైర్మన్ రిచర్డ్ షార్ప్ రాజీనామా.. నియామకానికి ముందు బోరిస్ జాన్సన్‌కు రుణమిప్పించడంలో సాయం!

By Mahesh K  |  First Published Apr 28, 2023, 11:24 PM IST

బీబీసీ చైర్మన్‌గా రిచర్డ్ షార్ప్ శుక్రవారం రాజీనామా చేశారు. 2021లో ఆయన నియామకానికి ముందే అదే సంవత్సరంలో అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్‌కు రూ. 8 కోట్ల రుణం ఇప్పించడంలో తాను సహకరించిన విషయాన్ని నియామక సమయంలో దాచి నిబంధనలు ఉల్లంఘించారని ఓ స్వతంత్ర దర్యాప్తులో తేలింది. బీబీసీకి కొత్త చైర్మన్ ఎన్నికయ్యే వరకు రిచర్డ్ షార్ప్ తన పదవిలో కొనసాగుతారు.
 


లండన్: ఇంగ్లాండ్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ చైర్మన్ రిచర్డ్ షార్ప్ తన పదవికి రాజీనామా చేశారు. తాను బీబీసీ చైర్మన్ నియామకానికి ముందు అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఓ బ్యాంకు ద్వారా రుణం ఇప్పించడంలో సహకరించినట్టు తేలింది. అయితే, ఈ విషయాన్ని తాను బీబీసీ చైర్మన్‌గా నియామకం అవుతున్న సమయంలో వెల్లడించలేదని, ఇలా ఆయన ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఓ స్వతంత్ర దర్యాప్తులో వెల్లడైంది.  దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 

రిచర్డ్ షార్ప్‌కు బీబీసీ చైర్మన్‌గా చేయాలనే కుతూహలం ఉన్నట్టు అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్‌కు తెలియజేశారు.ఆ పదవిపై ఆసక్తి చూపుతున్నట్టు చెప్పారు. అదే సమయంలో (2021లో) బోరిస్ జాన్సన్‌కు రూ. 8 కోట్ల మేరకు రుణం ఇప్పించే విషయంలో సాయం చేశారు. ఆ తర్వాత రిచర్డ్ షార్ప్ బీబీసీ చైర్మన్‌గా నియామకం అయ్యారు. కానీ, తాను బోరిస్ జాన్సన్‌కు రూ. 8 కోట్ల రుణం ఇప్పించడంలో తన ప్రమేయాన్ని బీబీసీ చైర్మన్‌గా నియామకం అవుతున్నప్పుడు రిచర్డ్ షార్ప్ వెల్లడించలేదని ఆరోపణలు వచచ్చాయి. ఈ ఆరోపణలు తీవ్రతరం కావడంతో ప్రభుత్వం ఓ స్వతంత్ర దర్యాప్తు చేపట్టింది.

Latest Videos

Also Read: నా కూతురు తన భర్తను ప్రధాని చేసింది: సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

బీబీసీ చైర్మన్‌ పోస్టుకు ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో రిచర్డ్ షార్ప్.. బోరిస్ జాన్సన్‌కు రుణం ఇప్పించడంలో తన ప్రమేయాన్ని వెల్లడించకుండా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారని ఈ దర్యాప్తు నివేదక తేల్చింది. దీంతో రిచర్డ్ షార్ప్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు.

2021లో రిచరడ్ షార్ప్ బీబీసీ చైర్మన్‌గా నియామకం అయ్యారు.

ఈ వివాదానికి ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ దూరంగా ఉన్నారు. తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే బీబీసీ చైర్మన్‌గా రిచర్డ్ షార్ప్ నియామకం అయ్యారని సునాక్ ఇటీవలే వెల్లడించారు.

click me!