అదృష్టమంటే ఆయనదే: లైజర్ కు మరోసారి దొరికిన రత్నం

By narsimha lodeFirst Published Aug 4, 2020, 5:57 PM IST
Highlights

అరుదైన రత్నాలు దొరికి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన టాంజానియాకు చెందిన సనెన్యూ లైజర్ ను మరోసారి అదృష్టం వరించింది.  తాజాగా ఆయనకు మరో రత్నం దొరికింది. దీంతో ఆయన అనంధానికి అవధులు లేకుండాపోయాయి.


టాంజానియా: అరుదైన రత్నాలు దొరికి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన టాంజానియాకు చెందిన సనెన్యూ లైజర్ ను మరోసారి అదృష్టం వరించింది.  తాజాగా ఆయనకు మరో రత్నం దొరికింది. దీంతో ఆయన అనంధానికి అవధులు లేకుండాపోయాయి.

మ‌న్యారాలోని టాంజానియా గ‌నుల్లో ల‌భ్య‌మైన ఈ ర‌త్నం 6.3 కిలోల బ‌రువు తూగింది. దీని విలువ 4.7 బిలియ‌న్లు(రెండు మిలియ‌న్ డాల‌ర్లు)గా ఉంటుంది. లైజర్ కు ఈ ఏడాది జూన్ మాసంలో రెండు రత్నాలు దొరికాయి. ఈ రెండు రత్నాలను  ప్రభుత్వానికి  విక్రయించాడు. ఆ సమయంలో ప్రభుత్వం అతనికి రూ. 25 కోట్లు ఇచ్చింది. 

also read:రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు: కార్మికుడి జీవితాన్ని మార్చింది ఇదే...

లైజర్ ప్రభుత్వానికి విక్రయించిన  రెండు రత్నాలు అతి పెద్ద రత్నాలని ఆ దేశ గనుల మంత్రిత్వశాఖ గతంలోనే ప్రకటించింది. రెండు రత్నాలను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో ఓ పాఠశాలను కట్టిస్తానని ఆయన హామీ ఇచ్చాడు. 

ఎప్పటిలాగే తన 2 వేల ఆవులను పెంచుకొంటున్నట్టుగా లైజర్ చెప్పారు. ఆయనకు నలుగురు భార్య, ముప్పై మంది పిల్లలు ఉన్నారు. ఈ భూమి మీదే అరుదైన‌విగా టాంజానైట్ ర‌త్నాలు గుర్తింపు పొందాయి. ఇవి ఆకుప‌చ్చ‌, ఎరుపు, నీలం, ప‌ర్పుల్ రంగుల్లో ల‌భ్య‌మ‌వుతాయి.రానున్న 20 ఏళ్ల‌లో ఇవి అంత‌రించిపోనున్నాయ‌ని అక్క‌డి స్థానిక భూగోళ‌వేత్త అంచ‌నా వేస్తున్నారు.

click me!