డబ్ల్యుహెచ్ఓ షాకింగ్ స్టేట్‌మెంట్: కరోనాకు చికిత్స లేదు, ఎప్పటికీ రాకపోవచ్చు

By narsimha lodeFirst Published Aug 4, 2020, 10:32 AM IST
Highlights

కరోనా నివారణకు ప్రస్తుతానికి అద్భుతమైన చికిత్స ఏదీ లేదు, అయితే ఎప్పటికీ కూడ రాకపోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రెసియస్ స్పష్టం చేశారు.


జెనీవా:కరోనా నివారణకు ప్రస్తుతానికి అద్భుతమైన చికిత్స ఏదీ లేదు, అయితే ఎప్పటికీ కూడ రాకపోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రెసియస్ స్పష్టం చేశారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనాను అడ్డుకొనేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, భౌతిక దూరం , మాస్క్ ధరించడం వంటి ప్రాథమిక అంశాలపైనే ప్రభుత్వాలు, పౌరులు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. 

also read:కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యకు కరోనా: ఆసుపత్రిలో చేరిక

చైనాలోని వుహాన్ లో ఈ వైరస్ మనుషుల శరీరాల్లోకి ఎలా ప్రవేశించిందనే విషయమై విచారణ చేసేందుకు  డబ్ల్యు హెచ్  ఓ ప్రతినిధులు విచారణ జరిపారని. ఈ విచారణ ప్రాథమిక దశ ముగిసిందన్నారు. 

ఈ వైరస్ మూలాలను కనుగొనేందుకు గాను డబ్ల్యు హెచ్ ఓ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం చైనా పరిశోధకులతో కలిసి ప్రయత్నించనుందని ఆయన తెలిపారు. 

కరోనాను నిరోధించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు టీకా తయారీ కోసం విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి. గప్రపంచ వ్యాప్తంగా 18.1 మిలియన్ల ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. 6,90,000 ల మంది కరోనా సోకి మరణించారు.

click me!