Afghanistan: రాక్ష‌స పాల‌నకు నాంది.. ఆఫ్ఘాన్ తాలిబ‌న్ స‌ర్కారు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

By Mahesh Rajamoni  |  First Published Dec 28, 2021, 1:00 AM IST

Afghanistan: తాలిబ‌న్లు ఆఫ్ఘానిస్థాన్ లో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్న త‌ర్వాత అక్క‌డి సామాన్య పౌరులు, మహిళల హక్కులను కాలరాస్తూ అనేక ఆంక్షలు విధిస్తూ రాక్ష‌స పాల‌న సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆఫ్ఘాన్ లో మున్ముందు ఎన్నికల మాటే విన‌ప‌డ‌కుండా చేసేందుకు తాలిబ‌న్ స‌ర్కారు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.
 


Afghanistan: ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబ‌న్ పాల‌కుల అరాచ‌కాలకు హ‌ద్దు లేకుండా పోతున్న‌ది. ప్రజా హ‌క్కుల‌ను కాల‌రాస్తూ తాలిబ‌న్లు రాక్ష‌స పాల‌న సాగిస్తున్నారు. ఇప్పటికే ఆప్ఘానిస్థాన్ లోని తాలిబ‌న్ స‌ర్కారు.. సామాన్య పౌరులు, మహిళల హక్కులను కాలరాస్తూ అనేక ఆంక్షలు విధించింది. ష‌రియా చ‌ట్టాన్ని అమ‌లు చేస్తూ.. ప్రజా హక్కులను హ‌రిస్తోంది. ఈ నేథ్యంలోనే మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆఫ్ఘానిస్థాన్ లో మున్ముందు ఎన్నికలనే మాటే విన‌బ‌డ‌కుండా చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చించింది తాలిబ‌న్ స‌ర్కారు. దీనికి అనుగుణంగా అధ్యక్ష, పార్లమెంట్‌, ప్రావిన్స్‌లలో కౌన్సిల్‌ ఎన్నికలు నిర్వహించే ఎన్నికల సంఘాన్ని తాలిబన్‌ సర్కార్‌ రద్దు చేసింది. ఇండిపెండెంట్‌ ఎలక్షన్‌ కమిషన్‌తోపాటు ఎలక్టోరల్‌ కంప్లైంట్‌ కమిషన్‌ను కూడా రద్దు చేసినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి బిలాల్‌ కరిమీ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోన్న ప‌రిస్థితుల్లో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతం ఆఫ్ఘాన్ లో  ఈ ఎన్నికల సంఘాలు అనవసరమని ఈ సందర్భంగా క‌రిమీ వ్యాఖ్యానించారు.

Also Read: Rakesh Tikait: ప్ర‌ధాని మోడీ నుంచి క్ష‌మాప‌ణ‌లు కోరడం లేదు కానీ.. రాకేష్ టికాయ‌త్ కీల‌క వ్యాఖ్య‌లు

Latest Videos

undefined

అలాగే, ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డితే దానికి అనుగుణంగా చ‌ర్య‌లు తీస‌కుంటామ‌ని తాలిబ‌న్ అధికార ప్ర‌తినిధి బిలాల్ క‌రిమీ వెల్ల‌డించారు. భవిష్యత్తులో ఎన్నికల సంఘం అవసరం ఏర్పడితే ప్రభుత్వం దానిని తిరిగి పునరుద్ధరిస్తుందని చెప్పారు. తాలిబ‌న్లు ముస్లిం లా గా పేర్కొనే ష‌రియా చ‌ట్టంలోని ప‌లు మార్పులు చేసిన పాల‌న సాగిస్తున్నారు. కాబ‌ట్టి తాలిబన్ల ప్రభుత్వంలో ఎన్నికల ప్రస్తావనే ఉండదు. అందుకే ఎన్నిక‌ల సంఘాల‌ను రద్దు చేసినట్లు రాజకీయ నిపుణులు, విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నిక‌ల సంఘ‌మే కాకుండా.. ఆఫ్ఘానిస్థాన్ లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా ఏర్పడిన శాంతి మంత్రిత్వ శాఖ, అలాగే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల‌ను సైతం రద్దు చేస్తున్నట్లు బిలాల్ క‌రిమీ వెల్లడించారు. తాలిబ‌న్ స‌ర్కారులో ఈ మంత్రిత్వ శాఖ‌ల అవ‌స‌రం లేద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌జా హ‌క్కుల‌ను హ‌రిస్తున్న తాలిబ‌న్ స‌ర్కారుపై అంత‌ర్జాతీయంగా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే చాలా దేశాలు ఆఫ్ఘానిస్థాన్ తో సంబంధాలు తెంచుకుంటున్నాయి.

Also Read: Omicron: కేర‌ళ‌లో ఒమిక్రాన్ టెన్ష‌న్‌.. నైట్ క‌ర్ఫ్యూ.. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు

ఇదిలావుండ‌గా, ఈ ఏడాది ఆగ‌స్టు 15న తాలిబ‌న్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో తాము ఇదివ‌ర‌కు కొన‌సాగించిన పాల‌నలా కాకుండా.. అంద‌రి హ‌క్కుల‌కు గౌర‌వ‌మిస్తామ‌ని పేర్కొన్నారు. కానీ, తాలిబ‌న్లు ఆఫ్ఘాన్ ను స్వాధీనం చేసుకున్న త‌ర్వాత చెప్పిన మాట‌లు ప్ర‌స్తుతం గాలిమూఠ‌లుగానే మిగిలాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే మహిళల్లో చాలా మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే చాలా మంది బాలికలను చదువుకు దూరం చేశారు. మ‌హిళ‌ల‌పై హ‌క్కుల‌ను హ‌రిస్తూ పాల‌న సాగిస్తున్న తాలిబ‌న్ల పై అంత‌ర్జాతీయంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌లు దేశాలు ఇప్ప‌టికే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. సంబంధాలు తెంచుకున్నాయి. ప్ర‌స్తుతం మ‌హిళా ప్ర‌యాణాల‌పై తాలిబ‌న్లు తీసుకున్న నిర్ణ‌యంపై అంత‌ర్జాతీయ మ‌హిళా సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. 1990లో ఆఫ్ఘాన్‌లో తాలిబ‌న్ పాల‌న కొన‌సాగిన రోజుల‌ను గుర్తుచేస్తూ.. మ‌హిళల‌ను నిర్బంధంలో ఉంచే విధంగా తాలిబ‌న్లు ముందుకు సాగుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. పురుషుల‌కు స‌మానంగా మ‌హిళా హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

Also Read: Coronavirus: ఒక్కసారి సోకిందో.. 7 నెలలు దాటిన వదలదు.. కరోనా పై సంచలన విషయాలు వెలుగులోకి !

click me!