జపాన్ లో నలుగురిని కాల్చి చంపిన నిందితుడి అరెస్టు.. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు

By Asianet News  |  First Published May 26, 2023, 10:40 AM IST

జపాన్ లో కాల్పులు జరిపి నలుగురిని హత్య చేసిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కాల్పుల్లో మరణించిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. అతడిని తెల్లవారుజామున 4.30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. 


జపాన్ లో గురువారం ఇద్దరు పోలీసులతో సహా మొత్తం నలుగురిని చంపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుపాకీ, కత్తితో దాడికి పాల్పడిన దుండగుడు ఓ భవనంలో దాక్కున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. నగానో ప్రాంతంలోని నకానో పట్టణానికి సమీపంలోని వ్యవసాయ ఆస్తి వెలుపల ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ అరెస్టు జరిగింది. 

తెరపైకి తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం.. నాకు కనీస ఆహ్వానం అందలేదన్న గవర్నర్ తమిళసై.. ఏమైందంటే ?

Latest Videos

కాగా.. ఈ ఘటనలో నాలుగో మరణాన్ని గురువారం రాత్రిపూట పోలీసులు ధృవీకరించారు. ఈ దాడిలో మరణించిన అధికారులను 46 ఏళ్ల యోషికి తమై, 61 ఏళ్ల టకువో ఇకేచిగా గుర్తించారు. ఈ ఘర్షణ సమయంలో పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు ధరించి, షీల్డ్లు పట్టుకుని, సమీపంలో అంబులెన్స్ తో ఉన్న దృశ్యాలు టీవీ ఫుటేజీలో కనిపించాయి. ఇంటి చుట్టుపక్కల 300 మీటర్ల (330 గజాల) పరిధిని పోలీసులు మూసివేశారు. నిశ్శబ్దంగా ఉన్న వ్యవసాయ పరిసరాల్లోని ప్రజలను ఇళ్లలోనే ఉండాలని నగర అధికారులు కోరారు.

13 ఏళ్ల అక్క ప్రియుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన చెల్లి.. తల్లిదండ్రులకు ఎక్కడ చెబుతుందో అని ఏం చేసిందంటే

ఇలాంటి హింసాత్మక నేరాలు జపాన్ లో చాలా అరుదు. ఆ దేశంలో కఠినమైన తుపాకీ నియంత్రణ చట్టాలు ఉన్నాయి. ఏటా తుపాకీ సంబంధిత నేరాలు ఆ దేశంలో అతి తక్కువగా నమోదు అయ్యేవి. కానీ ఇటీవలి సంవత్సరాలలో సబ్ వేలపై యాదృచ్ఛిక దాడులు పెరిగాయి. ఇంట్లో తయారుచేసిన తుపాకులు, పేలుడు పదార్థాలతోనే ఈ కాల్పులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. 

click me!