జింక కి ఆహారం తినిపించిన చిన్నారి.. నెటిజన్లు ఫిదా..!

By telugu news team  |  First Published May 25, 2023, 11:47 AM IST

ఆ తర్వాత జింక కూడా అమ్మాయి చర్యలకు ప్రతిస్పందించి నమస్కరిస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి జంతువుకు ఆహారం ఇస్తూ మళ్లీ కృతజ్ఞతగా నమస్కరిస్తుంది


చిన్న పిల్లలు, జంతువులకు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా చూడాలని అనిపిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఓ చిన్నారి తన బుబ్జి బుజ్జి చేతులతో ఓ జింకకు ఆహారం తినిపించింది. దాని కోసం దాని ముందు ఒంగి మరీ ప్రేమగా తినిపించడం విశేసం. ఈ 10 సెకన్ల వీడియో ఇప్పుడు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Two innocents know each other's language! 💓💕pic.twitter.com/QgghxJ3NvG

— Figen (@TheFigen_)


ది ఫిగెన్ అనే  ట్విట్టర్‌ ఎకౌంట్ ద్వారా ఈ వీడియోని షేర్ చేశారు.  కొమ్మలతో కూడిన గంభీరమైన జింక ముందు చిన్నారి గౌరవంగా నమస్కరిస్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత జింక కూడా అమ్మాయి చర్యలకు ప్రతిస్పందించి నమస్కరిస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి జంతువుకు ఆహారం ఇస్తూ మళ్లీ కృతజ్ఞతగా నమస్కరిస్తుంది. వారిద్దరికి ఒకరి భాష మరొకరికి తెలుసు అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ జత చేయడం విశేషం.

Latest Videos

ఈ వీడియో 816k వ్యూస్, టన్నుల కొద్దీ కామెంట్స్ రావడం విశేషం. ఆ చిన్నారి జింక పట్ల చూపించిన ప్రేమకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఎంత క్యూట్ అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. వారిద్దరూ ఎంత మంచి స్నేహితుల్లా ఉన్నారు అని మరొకరు, అందం, అమాయకత్వం కలబోసినట్లుగా వీడియో ఉందని మరొకరు కామెంట్ చేయడం విశేషం.
 

click me!