సూడాన్‌లో భద్రతా బలగాల మధ్య ఘర్షణలు.. సౌదీ విమానంపై గన్ ఫైర్

By Mahesh KFirst Published Apr 16, 2023, 3:21 AM IST
Highlights

సూడాన్‌లో ఆర్మీ, పారామిలిటరీల మధ్య ఘర్షణలు జరిగాయి. సూడాన్ నుంచి సౌదీకి వెళ్లడానికి సిద్దమైన విమానంపై కాల్పులు జరిగాయి. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగానే ఉన్నారు.
 

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపేద దేశాల్లో ఒకటైన సూడాన్‌లో సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. పౌర ప్రభుత్వం కోసం అక్కడి ప్రజలు ఇంకా ఎదురుచూపుల్లోనే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ సూడాన్ ఆర్మీ, పార్యామిలిటరీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. కాల్పులు జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ సౌదీ అరేబియాకు వెళ్లాల్సిన విమానంపై గన్ ఫైరింగ్ జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.

సూడాన్ నుంచి సౌదీ అరేబియాలోని రియాద్‌కు ప్రయాణించాల్సిన విమానంపై శనివారంపై ఫైరింగ్ జరిగింది. ఎయిర్ బస్ ఏ330 విమానం పై కాల్పులు జరిగాయని, అందులో ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. రియాద్‌కు వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. ప్రయాణికులంతా బోర్డింగ్ అయ్యాక ఈ ఘటన జరిగింది.

Also Read: Atiq Ahmed: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, సోదరుడు అష్రఫ్ హతం.. మీడియాతో లైవ్‌లో మాట్లాడుతుండగానే ఫైరింగ్(video)

అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని, ప్రయాణికులు, సిబ్బంది అంతా సేఫ్ అని ఆ స్టేట్‌మెంట్ పేర్కొంది. వారంతా సురక్షితంగా సూడాన్‌లోని సౌదీ ఎంబసీకి చేరుకున్నట్టు వివరించింది. ఇదిలా ఉండగా, సూడాన్‌లో పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ఇతర దేశాల విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. 

శనివారం ఆర్మీ, పారామిలిటరీలకు మధ్య ఘర్షణలు జరిగాయని, ఇందులో ముగ్గురు పౌరులు మరణించినట్టు వైద్యుల సంఘం తెలిపింది. 

click me!