ఏఐ క్లోన్ వాయిస్‌తో కిడ్నాప్ స్కామ్.. బాలిక తల్లికి ఫోన్ కాల్.. భారీగా డబ్బులు డిమాండ్..చివరకు ఏం జరిగిందంటే..

By Sumanth KanukulaFirst Published Apr 15, 2023, 12:43 PM IST
Highlights

నేరగాళ్లు అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను తప్పుడు పనులు చేసేందుకు వినియోగించుకుంటున్నారు. తెలివిగా తమ నేరాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

నేరగాళ్లు అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను తప్పుడు పనులు చేసేందుకు వినియోగించుకుంటున్నారు. తెలివిగా తమ నేరాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. తాజాగా ఏఐ వాయిస్ క్లోన్ ఉపయోగించి చేసిన నకిలీ కిడ్నాప్ డ్రామా ఒకటి అమెరికాలోని అరిజోనా‌లో వెలుగుచూసింది. వివరాలు.. అరిజోనాకు చెందిన జెన్నిఫర్ డిస్టెఫానో ఒక తెలియని నెంబర్ నుంచి కాల్‌ని అందుకుంది. అవతలి వైపు నుంచి తన 15 ఏళ్ల కుమార్తె బ్రీ "ఏడుస్తున్నట్లు"గా ఉన్న వాయిస్ వినిపించింది. అయితే ఆ వాయిస్ తన కుమార్తెదనని డిస్టెఫానో నమ్మింది.  

అవతలి వినిపించిన వాయిస్‌లో ‘‘అమ్మా.. నేను గందగోళంలో ఉన్నాను’’ అని బ్రీ వాయిస్‌తో వినిపించింది. ఆ వెంటనే ఒక మగ గొంతు‌తో బెదిరింపులు మొదలయ్యాయి. దుండగడు ‘‘మీ కుమార్తెను కిడ్నాప్ చేశాను’’ అని తనతో చెప్పినట్టుగా డిస్టెఫానో తెలిపింది. ‘‘మీరు పోలీసులను పిలవండి, మీరు ఎవరినైనా పిలవండి, నేను ఆమెను చాలా డ్రగ్స్‌తో పాప్ చేయబోతున్నాను, నేను ఆమెతో నా మార్గంలో వెళతాను. నేను ఆమెను మెక్సికోలో దింపబోతున్నాను’’ అని దుండగుడు చెప్పాడని పేర్కొంది. 

ఆ సమయంలో తన కుమార్తె సాయం కోరుతూ ఏడుస్తున్నట్టుగా వినిపించిందని డిస్టెఫానో తెలిపింది.‘‘అమ్మా నన్ను కాపాడు’’ అని కూడా కోరడం తనను ఆవేదనలోకి నెట్టిందని తెలిపింది. తాను కూడా తన కూతురు నిజంగానే కిడ్నాప్ అయిందేమోనని ఆందోళన చెందినట్టుగా చెప్పింది. ఎందుకంటే అక్కడ వినిపించింది. 100 శాతం తన కూతురు వాయిసేనని తెలిపింది. వెంటనే తన కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి బంధువులను, స్నేహితులను సంప్రదించామని చెప్పింది. 

‘‘అవతలి వ్యక్తి తన కుమార్తెను విడుదల చేయడానికి 1 మిలియన్ డాలర్లు డిమాండ్ చేశాడు. తర్వాత ఆ మొత్తాన్ని కొంత తగ్గించాడు. అయితే ఒక స్నేహితుడు నా భర్తకు ఫోన్ చేసి.. నా కూతురు క్షేమంగా ఉందని ధృవీకరించిన తర్వాత మాత్రమే తన కుమార్తె క్షేమంగా ఉందని తెలిసింది’’ అని డిస్టెఫానో తెలిపింది. 

అయితే పోలీసులు అవతలి నుంచి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడింది ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారని డిస్టెఫానో చెప్పింది. దుండగుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ క్లోన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు కనిపిస్తోందని తెలిపింది. ఇక, ఏఐ వాయిస్ క్లోన్ అనేది ఇటీవలి సంవత్సరాలలో ప్రజల గొంతులను అనుకరించడంలో మరింత సమర్థంగా మారింది. ఇంటర్నెట్‌లో ఉచితంగా లభించే ఏఐ సాధనాలతో దీన్ని యాక్సెస్ చేయడం,  ఉపయోగించడం చాలా సులభం.

click me!