ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటన చివరి రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన శ్రీలంకలో రైల్వే లైన్ ను ప్రారంభించారు. అదే విధంగా అనురాధపుర ఆలయాన్ని దర్శించుకున్నారు.
PM Modi in Srilanka: శ్రీలంక టూర్ చివరి రోజు ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక ప్రెసిడెంట్ అనురా కుమార దిసానాయకే కలిసి మహో-అనురాధపుర రైల్వే లైన్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌కు భారత దేశం సహాయాన్ని అందించింది. అనురాధపుర రైల్వే స్టేషన్ నుంచి మోదీ ఒక ట్రైన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే ప్రాజెక్ట్ ప్రారంభం తర్వాత మోదీ, శ్రీలంక ప్రెసిడెంట్ దిసానాయకేతో కలిసి అనురాధపురలో ఉన్న పవిత్ర జయ శ్రీ మహా బోధి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధాన పూజారి ప్రధాని చేతికి రక్షా సూత్రం కట్టి ఆహ్వానించారు. ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారత్, శ్రీలంకల సాంస్కృతిక సంబంధాలు ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి.
| PM నరేంద్ర మోదీ, శ్రీలంక ప్రెసిడెంట్ అనురా కుమార దిసానాయకేతో కలిసి శ్రీలంకలోని అనురాధపురలో ఉన్న జయ శ్రీ మహా బోధి టెంపుల్‌లో దర్శనం చేసుకున్నారు.
(Source - DD News) pic.twitter.com/M1X7zT0xs7
— ANI (@ANI)
అనురాధపుర పట్టణానికి శ్రీలంకలో ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఇది రిలీజియస్, కల్చరల్ పరంగా కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఈ పట్టణానికి వచ్చిన సమయంలో ఆయనకు ఆహ్వానం లభించింది. శ్రీలంక ప్రెసిడెంట్ అనురా కుమార్ దిసానాయకే స్వయంగా మోదీగారికి స్వాగతం పలికారు. ఈ సమయంలో శ్రీలంక ఎయిర్ ఫోర్స్ సోల్జర్స్ ప్రధానికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.