టెక్సాస్ హైస్కూల్ లో కాల్పులు.. ఓ విద్యార్థి మృతి, మరొకరికి గాయాలు..

By Asianet NewsFirst Published Mar 21, 2023, 8:52 AM IST
Highlights

టెక్సాస్ లోని ఓ హైస్కూల్ తోటి విద్యార్థులపై ఓ విద్యార్థి కాల్పులు జరిపాడు. దీంతో ఒకరు చనిపోయారు. మరొకరికి గాయాలు అయ్యాయి. అయితే ఆ విద్యార్థి ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఆ మైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నార్త్ టెక్సాస్ హైస్కూల్ లో సోమవారం ఉదయం జరిగిన కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఆర్లింగ్టన్ లోని లామర్ హైస్కూల్ లో బిల్డింగ్ వెలుపల ఈ కాల్పులు జరిగినట్లు ఆర్లింగ్టన్ పోలీస్ డిపార్ట్ మెంట్ తెలిపింది.

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏదో తెలుసా? భారత్ ఏ స్థానంలో నిలిచిందంటే ?

సోమవారం ఉదయం 7 గంటల లోపు హైస్కూల్ ఆవరణలో పలుమార్లు కాల్పులు జరిగాయన్న వార్తలపై ఆర్లింగ్టన్ పీడీ స్పందించారు. ఉదయం 7.35 గంటలకు తరగతులు ప్రారంభమవుతాయని, కాల్పులు జరిగినప్పుడు విద్యార్థులందరూ క్యాంపస్ కు రాలేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే అనుమానిత షూటర్ పాఠశాలలోకి ప్రవేశించాడని తాము విశ్వసించడం లేదని పోలీసులు తెలిపారు.

కాగా.. కాల్పులకు గురైన బాలుడిని అధికారులు, పాఠశాల సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. అయితే ఈ కాల్పుల్లో మరో విద్యార్థినికి కూడా గాయాలు అయ్యాయి. అయితే వాటి వల్ల ఆమెకు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.

సినీనటి సహాయకుడికి జాక్ పాట్.. లాటరీలో పదికోట్లు వరించింది.. ఎక్కడంటే...

విద్యార్థులపై కాల్పులు జరిపిన అనుమానితుడిని  ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆర్లింగ్టన్ పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలికి చేరుకున్న కొద్దిసేపటికే అధికారులు ఆ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకోగలిగారు. అయితే అతడిని కూడా విద్యార్థిగా గుర్తించామని, నిందితుడిపై హత్యానేరం మోపినట్టు చీఫ్ జోన్స్ మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి మైనర్ కావడంతో అతడి వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. నిందితుడిని ఆ ప్రాంతంలోని జువైనల్ డిటెన్షన్ సెంటర్ లో ఉంచారు.

అల్లోపతిలో ఆ వ్యాధులకు చికిత్స లేదు.. ఆవుపాలతో ఆయుర్వేదంతోనే వాటికి చెక్.. రాందేవ్ బాబా

అయితే కాల్పులు జరిగిన తర్వాత పాఠశాలను అధికారులు మూసివేశారు. తరువాత భవనం మొత్తాన్ని తనిఖీ చేశారు. దాదాపు 3.5 గంటల తర్వాత లాక్ డౌన్ ను ఎత్తివేశారు. అయితే ఈ కాల్పులకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన అదనపు సమాచారాన్ని త్వరలోనే వెల్లడిస్తామని అర్లింటన్ పోలీస్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇటీవల జార్జియాలోని డగ్లస్ కౌంటీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. పార్టీ జరుపుకునేందుకు 100 మందికి పైగా యువకులు ఓ ఇంట్లో గుమిగూడారు. ఇంట్లో జరిగిన పార్టీలో ఘర్షణ కారణంగానే కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. 

click me!