తూర్పు కాంగోలో ఉగ్రవాదుల దాడులు.. 22 మంది మృతి

By Mahesh RajamoniFirst Published Mar 20, 2023, 4:54 PM IST
Highlights

Congo militants attacks: తూర్పు కాంగోలో ఉగ్రవాదుల దాడుల్లో 22 మంది మృతి చెందారు. ఇటూరి ప్రావిన్స్ లోని పలు గ్రామాల్లో జరిగిన దాడుల్లో 12 మంది మృతి చెంద‌గా, నార్త్ కివులోని క్యావిరిము పర్వతం దిగువన ఉన్న ఎన్గులి గ్రామంలో ఉగ్రవాదులు 10 మంది ప్రాణాలు తీయడంతో పాటు ముగ్గురిని అపహరించారు.
 

Democratic Republic of the Congo: దక్షిణాఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ఉగ్రవాదుల దాడుల్లో తాజాగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు ఇటూరి, నార్త్ కివులో శనివారం జరిగిన వరుస దాడుల్లో 22 మంది చనిపోయారు. 

వివ‌రాల్లోకెళ్తే.. కాంగోలో పౌరులను లక్ష్యంగా చేసుకుని మిటిటెంట్ల దాడులు అక్క‌డి ప‌రిస్థితుల‌ను మ‌రింత‌గా దిగ‌జారుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తూర్పు కాంగోలో ఉగ్రవాదుల దాడుల్లో 22 మంది మృతి చెందారు. ఇటూరి ప్రావిన్స్ లోని పలు గ్రామాల్లో జరిగిన దాడుల్లో 12 మంది మృతి చెంద‌గా, నార్త్ కివులోని క్యావిరిము పర్వతం దిగువన ఉన్న ఎన్గులి గ్రామంలో ఉగ్రవాదులు 10 మందిని హతమార్చగా, ముగ్గురిని ఉగ్రవాదులు అపహరించార‌ని అంత‌ర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, కొన్నేళ్లుగా కాంగోలో మకాం వేసిన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలకు కూడా ఈ విషయం తెలియదు. ఆల‌స్యంగా ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కాంగో, ఐక్యరాజ్యసమితి దళాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో మిలిటెంట్లు ఇంత పెద్ద దాడికి పాల్పడటం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి.  

ఏ ప్రాంతాల్లో దాడులు జ‌రిగాయంటే.. ? 

ఇటూరి ప్రావిన్స్ లోని పలు గ్రామాల్లో శనివారం ఏకకాలంలో జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ మొత్తం వివాదానికి కోడెకో గ్రూపునే కారణమని స్థానిక అధికారులు, పౌర సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దట్టమైన అడవులతో ఉన్న ఈ ప్రాంతమంతా అస్థిరపరిచింది మిలిటెంట్ పోరాట యోధులేనని ఆయన అన్నారు. శాంతియుతంగా జీవించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, కోడెకో మిలీషియా బలహీన ప్రజలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆ ప్రాంతంలోని స్థానిక పరిపాలన కల్నల్ జాక్వెస్ డిసనోవా చెప్పిన‌ట్టు రాయిటర్స్ నివేదించింది. ఉత్తర కివులోని క్యావిరిము పర్వతంపై ఉన్న నాగులి గ్రామంలో ఉగ్రవాదులు మరో 10 మందిని హతమార్చారనీ, ముగ్గురిని కిడ్నాప్ చేశారని మహ్గీ సమీపంలోని మరో స్థానిక సైనిక నిర్వాహకుడు కల్నల్ ఎల్లెన్ కివేవా తెలిపారు.

దేశంలోని విస్తారమైన ఖనిజ సంపద కలిగిన తూర్పు ప్రాంతంలో పెద్ద ఎత్తున మిలీషియా హింసను అరికట్టే ప్రయత్నంలో కాంగో ప్రభుత్వం 2021 లో ఉత్తర కివు, ఇటూరిలో ముట్టడి చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే, హత్యలు, తిరుగుబాటు కార్యకలాపాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. 
 

click me!