ఆఫ్ఘన్లకు అండగా వుందాం : ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రపంచ దేశాలకు మోడీ పిలుపు

Siva Kodati |  
Published : Sep 25, 2021, 07:15 PM IST
ఆఫ్ఘన్లకు అండగా వుందాం  : ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రపంచ దేశాలకు మోడీ పిలుపు

సారాంశం

ఆఫ్ఘనిస్తాన్‌లోని మహిళలు, బాలలు, మైనార్టీలకు అండగా నిలవాల్సిన అవసరం వుందని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. నివారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సరైన సమయంలో సరైన పని జరగకపోతే, కాలమే ఈ పని పూర్తి చేస్తుందన్న చాణిక్యుడి వ్యాఖ్యలను మోడీ ఉదహరించారు.   

స్వాతంత్య్రం సాధించి భారత్ 75వ వసంతంలోకి అడుగుపెట్టిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. శనివారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. కరోనాతో ప్రపంచం కఠిన సమయాన్ని ఎదుర్కొంటోందని ప్రధాని  అన్నారు. ఈ శతాబ్థంలోనే ఇది అత్యంత కఠిన సమయమని.. భారత్‌లోనే విభిన్నతే తమ ప్రజాస్వామ్యానికి బలమని మోడీ తెలిపారు. కరోనా విపత్కర పరిస్ధితుల్లోనూ 3 కోట్ల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చామని ప్రధాని పేర్కొన్నారు. భారత్‌లో జరిగే పరిశోధనలు ప్రపంచానికి ఎంతో ఉపయోగకరంగా వున్నాయని నరేంద్ర మోడీ అన్నారు. భారత అభివృద్ధితో ప్రపంచ వృద్ధిలోనూ వేగం పెరిగిందని ప్రధాని గుర్తుచేశారు.

దేశంలో అనేక డిజిటల్ సంస్కరణలు చేపడుతున్నామని.. కరోనా సమయంలో భారత్ వ్యాక్సిన్ హబ్‌గా నిలిచిందని మోడీ వెల్లడించారు. ముక్కు ద్వారా ఇచ్చే టీకాను త్వరలోనే తీసుకొస్తామని ప్రధాని చెప్పారు. ఎంఆర్ఎన్ఏ కరోనా టీకా తయారీ చివరి దశలో వుందని ఆయన తెలిపారు. 12 ఏళ్లు దాటిన వారికి ఇచ్చే డీఎన్ఏ టీకాను భారత్ తయారు చేసిందని ప్రధాని చెప్పారు. డీఎన్ఏ టీకాను తయారు చేసిన మొదటి దేశం భారత్ అని.. దేశంలో ఆరు లక్షల గ్రామాలను డ్రోన్ మ్యాపింగ్ చేశామని మోడీ వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని మహిళలు, బాలలు, మైనార్టీలకు అండగా నిలవాల్సిన అవసరం వుందని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సరైన సమయంలో సరైన పని జరగకపోతే, కాలమే ఈ పని పూర్తి చేస్తుందన్న చాణిక్యుడి వ్యాఖ్యలను మోడీ ఉదహరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?