హెచ్1 బీ వీసా లపై అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు..!

By telugu news teamFirst Published Sep 25, 2021, 12:21 PM IST
Highlights

బైడెన్ తో వ్యక్తిగత సమావేశం అనంతరం.. మోదీ ఆస్ట్రేలియా కి చెందిన స్కాట్ మోరిసన్, జపాన్ కి చెందిన యోషిహిడే సుగాలతో.. నిర్వహించిన క్వాడ్ సమావేశంలోనూ పాల్గొన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ అక్కడ వైట్ హౌస్ లో బైడెన్ తో సమావేశం అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత ఆయనతో మోదీ ద్వైపాక్షిక భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

కాగా.. ఈ సమావేశంలో.. హెచ్1 బీ వీసా అంశాన్ని మోదీ.. బైడెన్ వద్ద ప్రస్తావించినట్లు భారత విదేశాంగా మంత్రుత్వశాఖ అధికారులు తెలిపారు. బైడెన్ తో ద్వైపాక్షిక సమావేశాన్ని అత్యుత్తమంగా జరిగిందని మోదీ అభివర్ణించారు. ఈ సమావేశం తర్వాత భారత్- అమెరికా సంబంధాలు మరింత బలంగా మారతాయని తాను భావిస్తున్నట్లు మోదీ తెలిపారు.

బైడెన్ తో వ్యక్తిగత సమావేశం అనంతరం.. మోదీ ఆస్ట్రేలియా కి చెందిన స్కాట్ మోరిసన్, జపాన్ కి చెందిన యోషిహిడే సుగాలతో.. నిర్వహించిన క్వాడ్ సమావేశంలోనూ పాల్గొన్నారు.

కాగా.. హెచ్1 బీ వీసా విషయమై.. మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో ప్రత్యేకంగా మాట్లాడటం గమనార్హం. యూఎస్ లో పనిచేసే చాలా మంది భారతీయ నిపుణుల సామాజిక భద్రత విషయాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. కాగా.. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. గతంలో హెచ్1 బీ వీసాలపై పలు మార్లు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాాగా.. వాటిని బైడెన్ ఇప్పటికే రద్దు చేశారు. 

ఇదిలా ఉండగా.. 2021లో ఇప్పటి వరకు భారతీయ విద్యార్థతతులకు రికార్డు స్థాయిలో 62,000 వీసాలు జారీ చేసామంటూ ఇటీవల వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలోదాదాపు 200,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం 7.7 బిలియన్ డార్లను అమెరికా ఆర్థిక వ్యవస్థకు అందించడం గమనార్హం. 

click me!