ఆఫ్గన్‌లో బహిరంగ శిక్షల అమలు: వ్యాపారి కిడ్నాప్ చేసిన వారిని కాల్చివేత, క్రేన్లకు మృతదేహాల వేలాడదీత

By Siva KodatiFirst Published Sep 25, 2021, 4:59 PM IST
Highlights

ఇకపై దేశంలో బహిరంగ శిక్షలను అమలు చేస్తామని ప్రకటించిన తాలిబన్లు యాక్షన్‌లోకి దిగారు. హెరాత్ సిటీలో వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురికి మరణశిక్ష విధించారు. వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురిని తాలిబన్లు కాల్చి చంపారు. అనంతరం మృతదేహాలను సిటీ జంక్షన్‌లో క్రేన్లతో వేలాడదీశారు


అమెరికా సేనలు వైదొలగడంతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు షరియా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. తొలినాళ్లలో శాంతి వచనాలు వల్లించిన తాలిబన్లు పూర్తిగా మారిపోయారు. ఇకపై దేశంలో బహిరంగ శిక్షలను అమలు చేస్తామని ప్రకటించిన తాలిబన్లు యాక్షన్‌లోకి దిగారు. హెరాత్ సిటీలో వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురికి మరణశిక్ష విధించారు. వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురిని తాలిబన్లు కాల్చి చంపారు. అనంతరం మృతదేహాలను సిటీ జంక్షన్‌లో క్రేన్లతో వేలాడదీశారు. కాళ్లు, చేతులు నరకడం వంటి శిక్షలు అమల్లో వుంటాయని తాలిబన్లు వెల్లడించారు. 

గతంలో 1996 నుంచి 2001 మధ్య ఆప్ఘనిస్తాన్ ను పాలించిన తాలిబన్లు అప్పట్లో క్రూరులుగా పేరు తెచ్చుకున్నారు. ఆప్ఘన్ గడ్డపై షరియా చట్టాలకు వ్యతిరేకంగా జరిగే అన్ని రకాల కార్యకలాపాలను అడ్డుకోవడమే కాకుండా దీనికి బాధ్యులైన ప్రతీ ఒక్కరికీ కఠినమైన శిక్షలు విధించే వారు. ఇందులో చేతుల నరికివేతతో పాటు ఉరిశిక్షలు కూడా ఉండేవి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమర్శలు వచ్చినా తాలిబన్లు ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నా ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోలేని పరిస్ధితి అప్పట్లో ఉండేది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటులో మహిళలకు స్ధానం కల్పిస్తామని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. అంతే కాదు దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్చగా సాగిపోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తిరుగుబాటుదారుల్ని అణచివేసే పనిలో తాలిబన్ ఫైటర్లు బిజీగా ఉన్నారు.

click me!