అబుదాబిలో అడుగుపెట్టిన ప్రధాని మోడీ.. యూఏఈ అధ్యక్షుడితో భేటీ

By Mahesh K  |  First Published Jul 15, 2023, 12:32 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ఈ రోజు ఉదయం యూఏఈలో అడుగు పెట్టారు. అబుదాబి విమానాశ్రయంలో అడుగుపెట్టగానే యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్ స్వాగతం పలికారు.
 


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అటు నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లారు. అబుదాబి విమానాశ్రయంలో ప్రధాని మోడీని యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్ స్వాగతించారు. పలువురు ప్రతినిధులు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. అనంతరం, వీరిద్దరూ సమావేశమయ్యారు.

ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్‌కు ప్రధాని మోడీ హాజరైన నేపథ్యంలో ఫ్రాన్స్, ఇండియాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. యూఏఈలో ఈ రోజు మొత్తం ప్రధాని పర్యటిస్తారు. అనంతరం, తిరిగి భారత్‌కు వస్తారు.

Grateful to Crown Prince HH Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan for welcoming me at the airport today. pic.twitter.com/3dM8y5tEdv

— Narendra Modi (@narendramodi)

Latest Videos

యూఏఈ పర్యటనలో ఇంధనం, ఆహార భద్రత, రక్షణ రంగాలపై ప్రధానంగా ప్రధాని మోడీ దృష్టి పెట్టనున్నారు. ఇది వరకు ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల పురోగతిని సమీక్షించనున్నారు. అనంతరం, మరిన్ని కీలక వాణిజ్య ఒప్పందాలకు అంకురార్పణ చేయనున్నారు.

Also Read:డబ్బుల వెంట పరుగులు పెట్టి లైఫ్ బోర్ కొట్టింది.. ట్రక్కు డ్రైవర్‌గా కంపెనీ సీఈవో

ఈ రోజు ఎయిర్‌పోర్టులో రాజు హెచ్‌హెచ్ షేక్ ఖాాలేద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్ స్వయంగా తనకు స్వాగతం పలకడం సంతోషంగా ఉన్నదని ప్రధాని మోడీ అన్నారు. అందుకు కృతజ్ఞతలు తెలిపారు.

click me!