ఆస్ట్రేలియాలో 23 ఏళ్ల భారతీయ విద్యార్థిపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశారు. ఇనుప రాడ్లతో కొడుతూ ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఖలిస్థాన్ తీవ్రవాద కార్యకలాపాలను వ్యతిరేకించినందుకు ఆస్ట్రేలియాలో 23 ఏళ్ల భారతీయ విద్యార్థిని ఖలిస్తాన్ మద్దతుదారులు ఇనుప రాడ్లతో కొట్టారు. సిడ్నీలోని పశ్చిమ శివారు ప్రాంతమైన మెర్రీలాండ్స్ లో ఈ దాడి జరిగిందని ‘ఆస్ట్రేలియా’ నివేదించింది. తన విధులకు వెళ్తున్న విద్యార్థిపై టార్గెట్ చేసి, అతడిని అడ్డుకొని దుండగులు "ఖలిస్తాన్ జిందాబాద్" అని నినదిస్తూ దాడి చేశారని పేర్కొంది.
అమానవీయం.. గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన..యూపీలో ఘటన, నిందితుల అరెస్టు
డ్రైవర్ గా పనిచేస్తున్న ఆ విద్యార్థి ఈ ఘటనను మీడియాతో వివరించారు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నేను పనికి వెళ్తుండగా 4-5 మంది ఖలిస్థాన్ మద్దతుదారులు నాపై దాడి చేశారని తెలిపారు. తన వాహనం ఎక్కుతుండగా దుండగులు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో వచ్చి, ఎడమ వైపు తలుపు తెరిచి తన చెంపపై ఇనుప రాడ్డుతో కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం బలవంతంగా వాహనం నుంచి బయటకు లాగి ఇనుప రాడ్లతో కొట్టారని తెలిపారు. అందులో ఇద్దరు తనపై జరిగిన దాడిని రికార్డు చేశారని చెప్పారు. తనపై దాడి చేస్తున్న సమయంలో దుండగులు ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని విద్యార్థి వివరించాడు. అంతా 5 నిమిషాల్లోనే జరిగిపోయిందని, ఖలిస్థాన్ అంశాన్ని వ్యతిరేకించినందుకు ఇది గుణపాఠం కావాలని చెప్పి వెళ్లిపోయారని అన్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ముగిసిన ప్రధాని మోడీ ప్రాన్స్ పర్యటన.. ఫ్రెంచ్-ఇండియా స్నేహం చిరకాలం కొనసాగుతుందంటూ మాక్రాన్ ట్వీట్
ఈ ఘటనపై న్యూ సౌత్ వేల్స్ (ఎన్ఎస్డబ్ల్యూ) పోలీసులకు సమాచారం అందించగా.. వారు గాయపడిన భారతీయ విద్యార్థిని వెస్ట్మీడ్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తల, కాలు, చేతికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. ఈ దాడిపై మెర్రీలాండ్స్ పార్లమెంటు సభ్యుడు మాట్లాడుతూ.. ‘మా స్థానిక సమాజంలో తీవ్రవాదానికి, హింసకు చోటు లేదు. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత అధికారులను సంప్రదించాను. పరిస్థితిని పర్యవేక్షిస్తాను’ అని చెప్పారు.
కాగా.. జనవరిలో జరిగిన "పంజాబ్ ఇండిపెండెన్స్ రెఫరెండం" సందర్భంగా మెల్బోర్న్ లో ఖలిస్తాన్ కార్యకర్తలు, భారత అనుకూల నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఖలిస్థాన్ వేర్పాటువాదుల భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరగడం, హిందూ దేవాలయాలపై తరచూ దాడులు జరుగుతుండటంపై ఆందోళన చెందిన భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా అధికారులను కోరిందని ‘ఇండియా టు డే’ నివేదించింది.