
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు ఫ్రాన్స్‌లో పర్యటించారు. జూలై 14వ తేదీన జరిగిన బాస్టిల్ డే వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని వారి దేశ అత్యున్నత పురస్కారంతో ఫ్రాన్స్ సత్కరించింది. ఫ్రాన్స్ అత్యున్నత పౌర, మిలిటరీ పురస్కారమైన గ్రాండ్ క్లాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్‌ను మోదీకి ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్ ప్రధానం చేశారు. భారతదేశం, ఫ్రాన్స్ మధ్య స్నేహపూర్వక దౌత్య, వాణిజ్య సంబంధాలను ప్రోత్సహించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. అయితే ఈ పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్.. ప్రధాని మోదీతో చాలా నిజాయితీగల బంధానికి ఉదాహరణగా నిలిచారు. మోదీకి చాలా ప్రత్యేకమై ఆతిథ్యం ఇచ్చారు.
శుక్రవారం పారిస్‌లో ప్రధాని మోదీకి అధికారికంగా విందు ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా లౌవ్రే మ్యూజియంలో ప్రధాని మోదీ గౌరవార్థం మెక్రాన్ ఈ విందును ఏర్పాటు చేశారు. అయితే క్వీన్ ఎలిజబెత్ కోసం 1953లో చివరిసారి ఇక్కడ విందు జరిగింది. అంతేకాకుండా.. విందు మోనులో శాఖాహారం కూడా పొందుపరిచారు.
సాధారణంగా పారిస్‌లో లౌవ్రే మ్యూజియం సాధారణంగా జాతీయ దినోత్సవం రోజున రద్దీగా ఉంటుంది. కానీ ప్రధాని మోదీ గౌరవార్థం ఇస్తున్న విందును నిర్వహించడానికి శుక్రవారం దానిని మూసివేశారు. సాధారణంగా.. లౌవ్రే మ్యూజియంలో ఫ్రెంచ్ ఫుడ్ ఉంటుంది. కానీ ఈసారి నరేంద్ర మోడీ కారణంగా ప్రోటోకాల్ మార్చబడింది. విందులో భారతీయ వంటకాలను కూడా అందించారు. ప్రధాని మోదీ శాఖాహారం తింటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మెనూలో ప్రత్యేకంగా శాఖాహారం ఉంచబడింది.
ఇక, విందు కోసం ప్రధాని నరేంద్ర మోదీ మ్యూజియం ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోగా.. మెక్రాన్ ఆయనకు స్వాగతం పలికారు. విందు కోసం గ్రేట్ హాల్ ఆఫ్ లౌవ్రేకు ప్రధాని మోదీతో కలిసి వెళ్లారు. ఈ విందుకు ఫ్రెంచ్ ప్రభుత్వ మంత్రులు, బడా పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రముఖ అతిథులు హాజరయ్యారు.