Bharat-China-Pakistan: చైనాకు ఆశ్రయంగా పాక్ అణ్వాయుధాల ఆధునీకరణ.. భారత్‌కు వ్యతిరేకంగా సైనిక ముఠా వ్యూహాలు

Published : May 26, 2025, 05:33 AM IST
Pinaka missile system that will be deployed at Indias borders with Pakistan China

సారాంశం

పాక్ తన అణ్వాయుధాలను చైనా సాయంతో ఆధునీకరిస్తోందని అమెరికా నివేదికలు తెలిపాయి. భారత్‌ను ముప్పుగా భావిస్తూ వ్యూహాత్మక చర్యలు చేపడుతోంది.

పాకిస్థాన్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు చైనా సహాయంతో పలు కీలక చర్యలు తీసుకుంటోందని అమెరికా రక్షణ నిఘా సంస్థ తాజా నివేదికలో పేర్కొంది. ‘వరల్డ్‌వైడ్ థ్రెట్ అసెస్‌మెంట్’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో పాక్, భారత్, చైనా సంబంధాలపై ముఖ్యమైన అంశాలు వెల్లడయ్యాయి.

ఈ నివేదిక ప్రకారం, భారత్‌ను తన అస్తిత్వానికి ప్రధాన ముప్పుగా పరిగణిస్తున్న పాకిస్థాన్.. సైనికపరంగా తన శక్తిని పెంచేందుకు నూతన మార్గాల్లో ముందడుగు వేస్తోంది. అణ్వాయుధాల అభివృద్ధి, వాటి భద్రత, నియంత్రణ వ్యవస్థలను ఆధునీకరించడంపై దృష్టిసారించిందని పేర్కొంది. అంతేగాక, అణు ఆయుధాల తయారీలో ఉపయోగించే పదార్థాలను విదేశీ చానెల్స్ ద్వారా తెచ్చుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం.

చైనా నుంచే పాక్‌కు ఈ సాంకేతికత, పరికరాలు వస్తున్నాయని, హాంకాంగ్, సింగపూర్, తుర్కియే, యూఏఈ వంటి దేశాలను మధ్యవర్తులుగా ఉపయోగించుకుంటోందని నివేదిక తెలిపింది. అయితే, పాక్‌లో చైనా పౌరులను లక్ష్యంగా ఉగ్రదాడులు జరగడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు కొంత మెరుగుపడుతున్నాయని నిఘా సంస్థ అంచనా వేసింది.

ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత్ తీవ్రంగా స్పందించిందని నివేదిక పేర్కొంది. ఆ దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రసంస్థల స్థావరాలపై క్షిపణుల దాడులు చేపట్టినట్టు, ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినట్టు పేర్కొంది.

భారత-చైనా సరిహద్దు విషయంలోనూ ఈ నివేదిక చర్చించింది. సైనిక బలగాల ఉపసంహరణ జరిగినప్పటికీ, సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారమవలేదని, దానివల్ల భవిష్యత్తులో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముందని స్పష్టం చేసింది.

ఈ నివేదిక ద్వారా పాకిస్థాన్ అణ్వాయుధాల విషయంలో చైనాపై ఎంతగా ఆధారపడుతోంది, ఆ సహకారంతో భారత్‌పై ఎలా వ్యూహాత్మక ఒత్తిడి తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది స్పష్టమవుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే